
సాక్షి, కర్ణాటక: మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. కుటుంబ సమస్యలు ఒక్కసారిగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశ్యంతో కిడ్నీ విక్రయానికి పెట్టిన 24 ఏళ్ల యువతిని సైబర్ కీచకులు నిలువునా మోసగించారు. దీంతో బాధిత యువతి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ ఘటనపై హడాపింగ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
ఆర్థిక సమస్యలు తొలగించుకోవాలని:
తల్లిదండ్రులతో బెంగళూరులో నివాసం ఉంటున్న యువతి బ్యాంకు ఉద్యోగిని. మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వాటిని నుంచి గట్టెక్కడానికి యువతి ప్రయత్నాలు చేపట్టింది. ఓ సోషల్ మీడియాలో కిడ్నీ దానం చేస్తే రూ. కోటి ఇస్తామనే ప్రకటన గమనించి అక్కడి ఫోన్ నెంబర్‌లో విచారణ చేసింది. సైబర్ వంచకుడు యువతికి తిరిగి ఫోన్ చేసి కిడ్నీ ఇవ్వాలనుకుంటే మొదట కొంత ఫీజు చెల్లించాలని సూచించాడు. పోలీస్ సర్టిఫికెట్ ఇతరత్రా వాటికి ముందు నగదు చెల్లిస్తే అనంతరం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటామని వంచక ముఠా యువతికి సూచించింది. వీరి మాటలు నమ్మిన యువతి కిడ్నీ ఇవ్వడానికి సమ్మతించి దశల వారీగా వారి వంచకులకు రూ. 3.14 లక్షలు చెల్లించింది. తిరిగి వంచకులు యువతిని నగదు అడగడంతో ఆమెకు అనుమానం రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని అధికారులు తెలిపారు. చదవండి: బెజవాడలో కత్తులతో విద్యార్థుల వీరంగం
బంగారు ఆభరణాలు విక్రయించి...
లాక్ డౌన్ సమయంలో బ్యాంకులు పనిచేయలేదు. దీంతో సదరు యువతికి కూడా ఇంటికే పరిమితమైంది. ఈ క్రమంలో కష్టాలు తీరాలంటే డబ్బులు కావాలని, కిడ్నీ విక్రయిస్తే డబ్బులు వస్తాయని భావించి గూగుల్‌లో తీవ్రంగా సోదించింది. చివరికి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు విక్రయించి వంచకుల అకౌంట్‌కు జమ చేసి నిలువునా మోసపోయింది. ఏటా పెరుగుతున్న సైబర్ నేరాలకు ఎప్పడు అడ్డుకట్టపడతాయో. చదవండి: విషాదం : మత్తు కోసం స్పిరిట్ తాగి ..
Comments
Please login to add a commentAdd a comment