బ్యాంకు ఉద్యోగి ఘాతుకం | Bank employee attacked with knife | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఉద్యోగి ఘాతుకం

Published Tue, Aug 1 2017 6:48 PM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

బ్యాంకు ఉద్యోగి ఘాతుకం

బ్యాంకు ఉద్యోగి ఘాతుకం

పావగడ(అనంతపురం): పట్టణంలోని రెయిన్‌ గేజ్‌ వీధిలో స్థానిక ఎస్‌బీఎం(ఐ) ఉద్యోగి రాఘవేంద్రాచారి(50) ఘాతుకం సృష్టించాడు. తల్లి వెంకటలక్ష్మమ్మ(70), భార్య మాధవి(45) కూతురు ప్రవల్లిక(12) లపై విచక్షణా రహితంగా మచ్చు కత్తితో దాడి జరిపి తీవ్ర గాయాల పాలుచేశాడు. ఈ దుర్ఘటన మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఈ దాడిలో తల్లి తలకు బలమైన దెబ్బలు తగలడంతో పరిస్థితి సీరియస్‌గా ఉంది. భార్య, కూతురు చేతులు, వీపు కు దెబ్బలు తగిలి తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులు ముగ్గురు బెంగుళూరు లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు రాఘవేంద్రాచారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... నిందితుడు ఎస్‌బీఎం బ్యాంకులో సీనియర్‌ హెడ్‌ క్యాషియర్‌ గా పని చేస్తున్నాడు. సంఘంటన జరిగిన రాత్రి సుమారు 1 గంటకు ఇంటికి చేరుకున్నాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చావని తల్లి అడగడంతో కోపోద్రిక్తుడై అందుబాటు లో ఉన్న మచ్చుకత్తితో తల్లి పై దాడి చేసి విచక్షణారహితంగా నరికాడు. అడ్డొచ్చిన భార్య , కూతురి పై కూడా దాడి చేసి నరికాడు. అయితే తల్లి తలను బలంగా నరకడంతో రక్త సిక్తమైంది. భార్య వీపుకు, కూతురి చేతులకు బలమైన గాయాలయ్యాయి. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను రాత్రికి రాత్రే బెంగుళూరు ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా నిందితుడు చాలా కాలం నుండి మానసిక వ్యాధితో బాధ పడుతుండే వాడని, సైకలాజిస్టుతో చికిత్స పొంది ఔషధాలు వాడుతుండేవాడని తెల్సింది. ఈ నేపథ్యంలో 2 నెలల నుండి మాత్రలు వాడక పోవడంతో సైకో రీతిలో ప్రవర్తించే వాడని తెల్సింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement