ఓ బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో బుధవారం భారీ చోరీ జరిగింది. నగరంలోని చైతన్యపురి అల్కాపురిలో బ్యాంక్ ఉద్యోగిని రాజేశ్వరి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు.
హైదరాబాద్: ఓ బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో బుధవారం భారీ చోరీ జరిగింది. నగరంలోని చైతన్యపురి అల్కాపురిలో బ్యాంక్ ఉద్యోగిని రాజేశ్వరి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో 33 తులాల బంగారం, 10 లక్షల నగదును దొంగలు అపహరించినట్టు సమాచారం.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.