రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బ్యాంకు ఉద్యోగిని దివ్య(23)హత్య కేసులో నిందితుడైన వేంకటేశ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారం రోజుల్లో పెళ్లి అనగా.. దివ్యను ప్రేమిస్తున్నానని వెంటపడుతూ వేధిస్తున్న నిందితుడు వేంకటేష్ ఈ నెల 18న ఆమెను హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసును చివరకు పోలీసులు ఛేదించారు. మొదట పోలీసులు వేంకటేష్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకోవడంతో నిందితుడు తానే స్వయంగా వచ్చి నిన్న(బుధవారం) వేములవాడ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన విషయం తెలిసిందే. విచారణలో నిందితుడు తానే దివ్యను కత్తితో పోడిచి హత్య చేసినట్లు ఒప్పకోవడంతో వేములవాడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.