
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నన్నపనేని
గుంటూరు: టీడీపీ సీనియర్ నాయకురాలు, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. హోంమంత్రి చినరాజప్ప మంగళవారం ఆమెను పరామర్శించారు. ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నన్నపనేని త్వరగా కోలుకోవాలని చినరాజప్ప ఆకాంక్షించారు. కాగా శ్వాసకు సంబంధించిన సమస్యతో నన్నపనేని బాధపడుతున్నారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది ఉంది.