
'సోనియాతో చేతులు కలిపిన సుష్మా'
న్యూఢిల్లీ: సుష్మా స్వరాజ్ను లోక్సభ ప్రతిపక్ష నేత హోదా నుంచి తొలగించాలని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. లోక్సభలో తెలంగాణ బిల్లుకు 'చిన్నమ్మ' మద్దతు తెలపడాన్ని ఆమె తప్పుబట్టారు. సోనియా-సుష్మా చీకటి ఒప్పందంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలన్నారు.
మూటలు తీసుకుని, మాటలు కలిపి సీమాంధ్రను ముంచుతారా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ ప్రధాని అయితే గుండు గీయించుకుంటానన్న సుష్మా ఇప్పుడు ఆమెతో ఎందుకు చేతులు కలిపారని అడిగారు. సుష్మా స్వరాజ్.. ఏ విధమైన ప్రలోభాలకు లోనయ్యారో బీజేపీ విచారణ జరపాలని సూచించారు.