మహిళలకు రక్షణ లేదా: నన్నపనేని
ఆంధ్రప్రాంత మహిళలకు సమైక్య రాష్ట్రంలో రక్షణ లేదని ఎమ్మెల్సీలు మండిపడ్డారు. సాక్షాత్తు మండలి ప్రాంగణంలో్నే సభ్యులమీదనే ఇలాంటి దాడులు జరుగుతుంటే రేపు పరిస్థితి ఏంటని నన్నపనేని రాజకుమారి కంటనీరు పెడుతూ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదా అని ఆమె ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులుగా తమ మనోభావాలు చెబుతుంటే ఇక్కడ దౌర్జన్యం, దాడి జరిగితే ఇక బయటి పరిస్థితి ఏంటన్నారు.
దాడికి పాల్పడిన తెలంగాణ ప్రాంత సభ్యులను, ఇతరులను వెంటనే అరెస్టు చేయాలని, అక్కడే పో్లీసులు ఉన్నా కూడా వారు ప్రేక్షక పాత్ర పోషిస్తూ, తమనే తోసేశారు తప్ప వారిని నియంత్రించేందుకు ఏమాత్రం ప్రయత్నించ లేదని ఆమె అన్నారు. అప్పుడే వాళ్లకు అధికారం వచ్చేసినంతగా పోలీసులు ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక పద్ధతిలో తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నిస్తుంటే తమపై దౌర్జన్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. తన పక్కనే ఉన్న దళిత మహిళపై కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దాడి చేశారని ఆమె ఆరోపించారు.