నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో 6 జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తోందని ఆ రాష్ట్ర హోంమంత్రి చిన్నరాజప్ప తెలిపారు. కరువు నివారణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు కలెక్టరేట్‌లో గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 2.98 లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉండగా ఈసారి 98 వేల హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారన్నారు. వర్షాభావం వల్ల భూగర్భ జలాలు ఎండిపోయి పరిస్థితి జటిలంగా మారిందన్నారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఎం. జానకి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
6 జిల్లాల్లో కరువు- హోంమంత్రి
Published Thu, Aug 13 2015 12:48 PM | Last Updated on Sat, Aug 18 2018 9:26 PM
Advertisement