ఏపీ మహిళా కమిషన చైర్మన్ నన్నపునేని రాజకుమారి(పాత చిత్రం)
అమరావతి: బాధితులకి సహాయం చేయాలంటే ఎన్నికల కోడ్ అడ్డు తగులుతోందని, వారికి సహాయం చేసేందుకు వీలుగా కోడ్ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపునేని రాజకుమారి ఎన్నికల కమిషన్‌ను కోరారు. గురువారం చిత్తూరు జిల్లా కుప్పం, విశాఖ జిల్లా గాజువాకల్లో మహిళలపై జరిగిన దాడులపై ఏపీ సీఈసీ గోపాలకృష్ణ ద్వివేదికి నన్నపనేని రాజకుమారి ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని, ప్రత్యేకంగా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని విన్నవించారు. రాజకీయ పార్టీలతో తనకు సంబంధం లేదని, మహిళలని ఓటు కోసం ఎవరు వేధించినా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment