
గుంటూరు(నగరంపాలెం): క్యారెక్టర్ లేని వారితో స్నేహాలు, ఫేస్‌బుక్ పరిచయాల ద్వారా మోసపోవడం వల్లే విద్యార్థినులు, మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. మంగళవారం గుంటూరులోని మహిళా కమిషన్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
ఇప్పటివరకూ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులెవరూ యాజమాన్యం ఒత్తిడి వల్లే మరణిస్తున్నామంటూ సూసైడ్ నోట్ రాయలేదన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో తరుచూ ఆత్మహత్యలు చోటుచేసుకోవడానికి కారణం.. అక్కడ ఎక్కువ మంది విద్యార్థులు చదవడమేనని చెప్పుకొచ్చారు. ఒత్తిడి ఉంటే చదువు మానేయాలే గానీ ఆత్మహత్య చేసుకోవడం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment