నన్నపనేని సంచలన వ్యాఖ్యలు | Nannapaneni Rajakumari Sensational Comments On Men Safety | Sakshi
Sakshi News home page

నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు

Published Wed, May 30 2018 3:43 PM | Last Updated on Wed, May 30 2018 4:39 PM

Nannapaneni Rajakumari Sensational Comments On Men Safety - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి బుధవారం  సంచలన వ్యాఖ్యలు చేశారు. పురుషుల రక్షణ కోసం ఒక కమిషన్ ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. రాజకుమారి బుధవారం మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలోని విజయనగరంలో భర్తను చంపించిన భార్య ఘటన, శ్రీకాకుళం జిల్లాలో భర్తపై హత్యాయత్నం వంటి సంఘటనలు విస్తుగొలిపాయని అన్నారు.

మహిళల బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని ఆమె తెలిపారు. శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి అండగా ఉంటామన్నారు. టీవీ సీరియల్స్‌ల ప్రభావం వల్లనే మహిళల్లో నేర ప్రవృత్తి పెరుగుతోందని పేర్కొన్నారు. సీరియల్స్‌ మీద సెన్సార్‌ పెట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు. మహిళల నుంచి పురుషులకు రక్షణ కోసం పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని నన్నపనేని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement