నన్నపనేని రాజకుమారి రాజీనామా | Nannapaneni Rajakumari Resigns As AP Women Commission Chairperson | Sakshi
Sakshi News home page

మహిళా కమిషన్‌ చైర్మన్‌ పదవికి నన్నపనేని రాజీనామా

Published Wed, Aug 7 2019 1:15 PM | Last Updated on Wed, Aug 7 2019 4:17 PM

Nannapaneni Rajakumari Resigns As AP Women Commission Chairperson - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కి అందచేశారు. అనంతరం నన్నపనేని మాట్లాడుతూ...‘ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా రాజీనామా చేశాను. మూడేళ్ల వార్షిక నివేదికను గవర్నర్‌కు అందచేశా. నా నివేదికను చూసి గవర్నర్‌ అభినందించారు. రెండు నెలల ఆలస్యానికి మూడేళ్ల నివేదిక అడ్డంకిగా మారింది.  నా హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచా. వసతి గృహాల్లో భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాలి.’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement