మహిళలపై వేధింపులు సహించం
మహిళలపై వేధింపులు సహించం
Published Sat, Mar 4 2017 10:40 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి
నరసరావుపేట టౌన్: సమాజంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా అకృత్యాలు పెచ్చరిల్లుతున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపునేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘కూతురిపై తండ్రి అఘాయిత్యం’ అన్న శీర్షికన ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించి శనివారం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు వచ్చి బాధితురాలిని పరామర్శించారు.
మహిళలను వేధించినా, వారిపై అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడికి బెయిలు ఇవ్వడం సమంజసం కాదన్నారు. రాజకీయంగా సిఫారసులు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు ఆమె వివరించారు. బాలికల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బాధితురాలు చదువుకుంటానంటే ఆమెను గుంటూరులోని బాలికా సంరక్షణ గృహంలో ఉంచి చదివిస్తామన్నారు. గ్రామాల్లో కౌన్సెలింగ్ సెంటర్లు, సెమినార్లు నిర్వహించి మహిళలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట డ్వామా పీడీ సుఖజీవన్‌బాబు, సీడీపీవో స్వర్ణలక్ష్మి, ఎఎల్‌డీపీవో నాగకోటేశ్వరరావు, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ మోహనశేషు ప్రసాద్ ఉన్నారు.
Advertisement