పల్నాడులో మహిళలపై ఇంతటి దాడులా? | Women have complained to State Women Commission about attacks on them by TDP leaders | Sakshi
Sakshi News home page

పల్నాడులో మహిళలపై ఇంతటి దాడులా?

Published Tue, May 21 2024 5:18 AM | Last Updated on Tue, May 21 2024 5:18 AM

Women have complained to State Women Commission about attacks on them by TDP leaders

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహం 

నిందితులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు లేఖ

సాక్షి, అమరావతి/మాచవరం: రాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా తమకు ఓట్లు వేయలేదనే కక్షతో ఎస్సీ, బీసీ మహిళలపై దాడులకు దిగడం దారుణమని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళలు తమపై టీడీపీ నేతలు చేసిన దాడులపై సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన చైర్‌పర్సన్‌ వెంకటలక్ష్మి తక్షణం బాధితులకు రక్షణ కలి్పంచి, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎస్సీ, బీసీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని ఇంతలా దాడులు చేయడం దుర్మార్గమన్నారు.

ఇలాంటి వాతావరణం ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధమన్నారు. కొత్త గణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళలను దాదాపు 24 గంటలపాటు బంధించి కొందరు దుర్మార్గులు చిత్రహింసలకు గురిచేయడం అత్యంత పాశవికమని ఆందోళన వ్యక్తంచేశారు. చివరకు వాళ్లంతా గుడిలోకి వెళ్లి దాక్కున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. వారు స్వేచ్ఛగా నచి్చన వారికి ఓటు వేసే హక్కు లేదా అని ఆవేదన వ్యక్తంచేశారు. ఓట్లేసినంత మాత్రాన అదే పాపమని చంపేస్తారా? అని ప్రశ్నించారు

 చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళల పట్ల చిన్నచూపుతో వ్యవహరించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని వారిపై దాడులకు ఉసిగొల్పుతున్న చంద్రబాబు తీరుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధిత మహిళలకు ఏపీ మహిళా కమిషన్‌ అండగా ఉంటుందని స్పష్టంచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement