venkatalakshmi
-
తూతూమంత్రంగా కాదు.. కఠినంగా వ్యవహరించండి: ఏపీ మహిళా కమిషన్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నూజివీడు బాధిత బాలికను ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి మంగళవారం పరామర్శించారు. నూజివీడు మండలం పల్లెర్లమూడికి చెందిన నాలుగేళ్ల బాలిక పై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి యత్నించిన సంగతి తెలిసిందే. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించామని గజ్జల వెంకటలక్ష్మి తెలిపారు. అలాగే.. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందేలా చూస్తామని హామీచ్చారామె.‘‘ఊయలలో వేసిన నెలల బిడ్డను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. తూతూ మంత్రంగా కేసులు పెట్టడం వల్ల నిందితులు నెలరోజుల్లోనే బెయిల్‌పై బయటికి వచ్చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. వరకట్న వేధింపులు , అత్యాచారాలు, దాడులు, ఫోక్సో కేసులు పెరిగిపోయాయి. మహిళలు బతకాలంటేనే భయపడిపోతున్నారు‘‘ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ పేర్కొన్నారు.‘‘ప్రతీ కేసును మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటుంది. దిశ ద్వారా వచ్చిన కేసుల్లో కూడా త్వరగా శిక్ష పడేలా చేశాం. రమ్య హత్య కేసులో వేగంగా ఛార్జిషీట్ వేయించి.. నిందితుడికి శిక్ష పడేలా చేయగలిగాం. నెల్లూరులో విదేశీ యువతిని వేధించిన కేసులో దిశా యాప్ ద్వారా రక్షించగలిగాం. రాజకీయాలకు అతీతంగా ప్రతీ కేసును మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటుంది.. .. ఎస్పీలకు యాక్షన్ టేకెన్ కోసం పంపిస్తున్నాము. పోలీసులకు ఏం ఇబ్బందులున్నాయో తెలియడం లేదు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. మహిళా కమిషన్ ప్రతీ మహిళకు భద్రత కల్పించేందుకు పనిచేస్తుంది. దిశ యాప్ ద్వారా ఎంతో మంది మహిళలకు రక్షణ కల్పించాం‘‘ అని గజ్జల వెంకటలక్ష్మి చెప్పారు. -
మహిళా కమిషన్‌కూ వేధింపులు
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కూటమి ప్రభుత్వం కక్షకట్టింది. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధంగా నియమితులైన పలు కమిషన్ల చైర్పర్సన్లు, సభ్యులను వేధింపులకు గురి చేస్తోంది. వారికి వేతనాలు, టీఏ, డీఏలు నిలిపివేసింది. కనీసం కార్యాలయ నిర్వహణ ఖర్చులూ ఇవ్వడంలేదు. వేతనాలు, టీఏ, డీఏ, నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని కోరితే రాజీనామా చేసి వెళ్లిపోవడం మంచిదని, లేదంటే ఇబ్బందులు తప్పవంటూ అధికారులతో చెప్పిస్తోంది.చివరకు మహిళలకు రక్షణగా నిలిచే మహిళా కమిషన్‌ను సైతం ఇదే విధంగా కక్షపూరితంగా వేధిస్తోంది. దీంతో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాష్ట్ర గవర్నర్‌కు, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శికీ ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్లు, సభ్యులు రాజీనామా చేసి వెళ్లిపోతే, ఆ స్థానాల్లో తమ వారికి పదవులు కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుయుక్తులకు పాల్పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పదవీకాలం 2026 మార్చి వరకు ఉంది. అయితే, గత నాలుగు నెలల వేతన బకాయిలను కోరినా ప్రభుత్వం చెల్లించడంలేదు. సభ్యులకు ఒక నెల వేతనాన్ని నిలిపివేసింది. ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. కమిషన్ చైర్పర్సన్, సభ్యులు విశాఖపట్నం, నర్సీపట్నం, నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచేలా చర్యలు చేట్టారు. ఈ పర్యటనల టీఏ, డీఏలు విడుదల చేయకుండా ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి నిర్వహణ ఖర్చులూ నిలిపివేసింది. దీంతో ఆఫీస్ నిర్వహణ, టీఏ, డీఏలు సైతం కమిషన్ చైర్పర్సన్ సొంతంగా పెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలకు గురైన ఘటనల్లో బాధితులను ఆదుకోవలంటూ కమిషన్ ఇస్తున్న ఆదేశాలను సైతం అధికారులు, పలు జిల్లాల ఎస్పీలు బేఖాతరు చేస్తున్నారు. ఎస్పీలు కనీసం యాక్షన్ టేకెన్ రిపోర్టులు కూడా పంపించడంలేదు.కమిషన్లకు వేతనాలు ఆపాలంటూ సీఎం ఆదేశాలురాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా గత ప్రభుత్వం నియమించిన అనేక కమిషన్లకు నెలవారీ ఇచ్చే గౌరవ వేతనాలను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అదేశాలు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్, మైనార్టీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఆర్టీఐ కమిషన్ వంటి వాటికి ఈ నెలలో గౌరవ వేతనాలు, టీఏ, డీఏలు ఇవ్వలేదు. ఇలా ఇబ్బందులకు గురిచేసి, రాజకీయంగా వేధించి వారు రాజీనామా చేసి వెళ్లిపోయేలా చేయాలన్నది చంద్రబాబు సర్కారు ఎత్తుగడగా తేటతెల్లమవుతోంది. న్యాయ పోరాటం చేస్తా: గజ్జల వెంకటలక్ష్మినాకు, తోటి సభ్యులకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. సభ్యులకు ఒక నెల వేతనం ఆపేశారు. నాకు 4 నెలల వేతన బకాయిలకు అర్జీ పెట్టుకున్నా చెల్లించలేదు. కనీసం టీఏ, డీఏలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. గౌరవ వేతనం అడిగితే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అధికారులతో ప్రభుత్వం సలహాలు ఇప్పిస్తోంది. బిల్లులు మంజూరు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్‌ను అడిగితే మహిళా కమిషన్‌గా మిమ్మల్ని ఉండనివ్వరని, రాజీనామా చేయిస్తారంటూ బెదిరించినట్టు మాట్లాడారు. ఇదే విషయమై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జి.జయలక్ష్మికి ఫిర్యాదు చేశాను. వారు ఏ చర్యలు తీసుకుంటారో చూస్తాను. రాజ్యాంగ బద్దమైన నా పదవి రెండేళ్లపాటు (2026 మార్చి వరకు) ఉంటుంది. రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై ప్రభుత్వం తీరు మారకుంటే న్యాయ పోరాటానికి సిద్ధం. -
పల్నాడులో మహిళలపై ఇంతటి దాడులా?
సాక్షి, అమరావతి/మాచవరం: రాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా తమకు ఓట్లు వేయలేదనే కక్షతో ఎస్సీ, బీసీ మహిళలపై దాడులకు దిగడం దారుణమని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళలు తమపై టీడీపీ నేతలు చేసిన దాడులపై సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన చైర్పర్సన్ వెంకటలక్ష్మి తక్షణం బాధితులకు రక్షణ కలి్పంచి, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎస్సీ, బీసీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని ఇంతలా దాడులు చేయడం దుర్మార్గమన్నారు.ఇలాంటి వాతావరణం ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధమన్నారు. కొత్త గణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళలను దాదాపు 24 గంటలపాటు బంధించి కొందరు దుర్మార్గులు చిత్రహింసలకు గురిచేయడం అత్యంత పాశవికమని ఆందోళన వ్యక్తంచేశారు. చివరకు వాళ్లంతా గుడిలోకి వెళ్లి దాక్కున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. వారు స్వేచ్ఛగా నచి్చన వారికి ఓటు వేసే హక్కు లేదా అని ఆవేదన వ్యక్తంచేశారు. ఓట్లేసినంత మాత్రాన అదే పాపమని చంపేస్తారా? అని ప్రశ్నించారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళల పట్ల చిన్నచూపుతో వ్యవహరించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని వారిపై దాడులకు ఉసిగొల్పుతున్న చంద్రబాబు తీరుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధిత మహిళలకు ఏపీ మహిళా కమిషన్ అండగా ఉంటుందని స్పష్టంచేశారు. -
బాలికలు, మహిళలను వేధించే వారిని వదలం
మధురవాడ(భీమిలి): బాలికలు, మహిళలను ఇబ్బందులకు గురిచేసినా, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి హెచ్చరించారు. విశాఖ కొమ్మాది చైతన్య కళాశాలలో ఫ్యాకల్టీ లైంగిక వేధింపులకు విద్యార్థిని రూపశ్రీ మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో విచారణ కమిటీ సభ్యులు, ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావుతో కలిసి బుధవారం ఆమె కళాశాలను సందర్శించారు. తరగతి గదులు, ల్యాబ్‌లు, హాస్టల్ భవనం, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తర్వాత అక్కడి ఇంజనీరింగ్, డిప్లమా ఫ్యాకల్టీ, సిబ్బందితో వేర్వేరుగా సమావేశమయ్యారు. మీ పిల్లలు ఈ పరిస్థితిలో ఉంటే ఇలానే వదిలేస్తారా? ఇక్కడ ల్యాబ్‌లో ఓ వ్యక్తి ఆడబిడ్డల పట్ల అంత దారుణంగా వ్యవహరిస్తున్నాడంటే వాడు మనిషా, పశువా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల గుర్తింపు రద్దుకు సిఫార్సు అనంతరం వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పిల్లలను తీర్చిదిద్దాల్సిన ఫ్యాకల్టీయే విద్యార్థులతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించడం దారుణమన్నారు. విద్యా సంస్థకు ఉండాల్సిన కనీస నిబంధనలను ఈ కళాశాల పాటించడం లేదని తెలిపారు. చాలా చోట్ల సీసీ కెమెరాల్లేవని, ల్యాబ్‌లో మానిటరింగ్ సిస్టమ్ లేదన్నారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, రికార్డులు, ఐసీసీ కమిటీలు, యాంటీ ర్యాగింగ్ సిస్టం.. కనీసం కంప్లయింట్ బాక్స్ కూడా లేదన్నారు. కళాశాల గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తున్నామన్నారు. హాస్టల్లో విద్యార్థులకు కల్పించే వసతులు, భోజనం వంటి విషయాల్లోనూ వివక్ష ఉందని, ప్రభుత్వం నుంచి ఫీజు వచ్చేవారికి నాణ్యమైన భోజనం లేదని, కనీసం మంచాలు కూడా లేవన్నారు. ప్రైవేటు ఫీజులు చెల్లించే వారికి అన్ని సౌకర్యాలూ కల్పించారని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు అరెస్ట్ అయ్యారని, ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు. కాగా, రూపశ్రీ మృతిపై వెంకటలక్ష్మి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నాలుగో అంతస్తుపై నుంచి పడి మృతి చెందిన బాలిక శరీరంపై ఏ రకమైన దెబ్బలూ లేకపోవడం, ఒక బాలిక ఉదయం నుంచి రాత్రి వరకు కనిపించకున్నా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయన్నారు. అనంతరం ఆందోళన శిబిరంలో ఉన్న రూపశ్రీ తల్లిదండ్రులను పరామర్శించి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ, ఏపీఎస్‌సీపీసీ డైరెక్టర్ టి.ఆదిలక్ష్మి, మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్.సుజి, ఏయూ లా కాలేజి ప్రొఫెసర్ విజయలక్ష్మి, మహిళా కమిషన్ లీగల్ కౌన్సిలర్ పూజితయాదవ్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి నివేదిక ఇవ్వండిసీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్న.. అంటూ తండ్రికి మెసేజ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. బాలిక ఆత్మహత్య ఘటనపై పూర్తి నివేదికను అందించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులిచి్చంది. మార్చి 28న విశాఖపట్నం కొమ్మాదిలోని ‘చైతన్య ఇంజనీరింగ్’ కళాశాలలో డిపొ్లమా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ(16) లైంగిక వేధింపుల కారణంగా హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఫ్యాకల్టీయే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని తండ్రికి మెసేజ్‌లో తెలిపింది. ఈ ఘటనపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఎన్హెచ్ఆర్సీ సుమోటాగా కేసు నమోదు చేసింది. నాలుగు వారాల్లో బాలిక ఆత్మహత్యకు గల కారణాలతో తమకు నివేదిక అందించాలంటూ సీఎస్, డీజీపీలను ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. నివేదికతో పాటు రాష్ట్ర పోలీసు శాఖ జరిపిన ఇన్వెస్టిగేషన్‌ను కూడా తెలపాలంటూ సూచించింది. కాగా, బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనను పరిశీలిస్తే కొమ్మాదిలోని “చైతన్య ఇంజనీరింగ్’ కళాశాల యాజమాన్యమే కారణం అనే విషయం తెలుస్తోందంటూ ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. కాలేజీలో ఇంకెంతమంది విద్యార్థినిలు ఫ్యాకల్టీల లైంగిక వేధింపులకు గురవుతున్నారనే విషయాన్ని రాష్ట్ర పోలీసు శాఖ క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సూచనలు చేసింది. విద్యార్థినులను వేధిస్తున్న వారిపై కేసులను సైతం నమోదు చేయాలని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. -
ప్రేమను తిరస్కరించిందని చంపేసాడు
-
అంగన్వాడీ కేంద్రంలో పేలిన కుక్కర్
శ్రీకాకుళం , లావేరు: మండలంలోని తాళ్లవలస అంగన్వాడీ కేంద్రంలో పెనుప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా కుక్కర్ పేలడంతో కార్యకర్తకు గాయాలయ్యాయి. విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఉదయం అంగన్వాడీ కార్యకర్త వెంకటలక్ష్మి కుక్కర్లో పప్పు వండుతుండగా అది అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో కార్యకర్త మొహంతో పాటు మరికొన్ని చోట్ల కాలిపోయింది. వెంటనే ఆమెను గ్రామస్తులు శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కుక్కర్ పేలిన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ..కేంద్రానికి పరుగున వచ్చారు. అయితే పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న మండల పరిషత్ ప్రత్యేకాహ్వానితుడు ముప్పిడి సురేష్, రణస్థలం ఐసీడీఎస్ ప్రాజెక్టు పీవో కె.రూపవతి, ఎంపీడీవో ఎం.కిరణ్‌కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు జి.ఝూన్సీ, పి.కరుణశ్రీ.. అంగన్వాడీ కార్యకర్త వెంకటలక్ష్మిని పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను కోరారు. -
వెంకటలక్ష్మీ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
వెంకటలక్ష్మీ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
కరీంనగర్(సుల్తానాబాద్): సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన కుంభం వెంకటలక్ష్మీ కుటుంబాన్ని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని సమస్యలు ఉంటే తమకు ఫోన్‌ద్వారా వివరించాలని సూచించారు. వైఎస్ షర్మిల వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లసూర్యప్రకాశ్, బోయినిపల్లి శ్రీనివాస్‌రావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వేణుమాధవరావులతో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పరామర్శ యాత్రలో పాల్గొన్నారు. -
లోయలో పడిన మహిళ
తిరుమల: తిరుమల అవ్వాచ్చారి కోన లోయలో మంగళవారం ఓ మహిళ ప్రమాదవశాత్తు పడింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పొదలకూరు వెంకటలక్ష్మి(45) ఒంటరిగా కాలిబాటలో తిరుమలకు బయలుదేరారు.సాయంత్రం నాలుగు గంటలకు నృసింహస్వామి ఆలయానికి సమీపంలోని అవ్వాచ్చారి కోన లోయలో సుమారు 20అడుగుల లోతులో ఆమె పడి పోయారు. సమాచారం తెలియగానే విజిలెన్స్ ఏవీఎస్వో సాయిగిరిధర్ ఫైర్ సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి వెళ్లారు. గాయాలపాలైన ఆమెను స్ట్రెచర్‌పై తాళ్లసాయంతో పైకి తీసుకొచ్చి తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. కాగా, తన వ్యక్తిగత వివరాలు చెప్పేందుకు ఆమె నిరాకరించారు. -
ఆందోళన చేస్తే అరెస్టు చేస్తారా!
ఆందోళన చేస్తే అరెస్టు చేస్తారా! ఆత్మకూరుటౌన్, న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తే అరెస్టులు చేస్తారా అని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ వెంకటలక్ష్మి ప్రశ్నించారు. బుధవారం పట్టణంలోని కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారిలోని గౌడ్ సెంటర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను అంగన్వాడీలు దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. సుదర్శన్ భవనం నుంచి ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర ప్రధాన రహదారి, పురవీధులవెంట నిర్వహించారు. అంగన్వాడీల నినాదాలతో ఆత్మకూరు పట్టణం అట్టుడికింది. దాదాపు రెండు గంటల సేపు కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఎన్నో సార్లు ధర్నాలు చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అంగన్వాడీ మహిళలపై లాఠీ చార్జ్‌లు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రణధీర్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాళ్లు జయలక్ష్మి, చంద్రకళ, మంజుల, లలితమ్మ, ఎస్ఎఫ్ఐ నాయకులు రాజేష్ పాల్గొన్నారు. వెలుగోడులో.. వెలుగోడు, : తమ డిమాండ్లను పరిష్కరించాలని బుధవారం పొట్టి శ్రీరాములు సెంటర్లో రాస్తారోకో అంగన్వాడీ ఉద్యోగులు నిర్వహించారు. పట్టణ పురవీధుల వెంట రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు రమాదేవి, శ్యామల మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ.12,500లు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.