కారు బోల్తా, నన్నపనేని అల్లుడికి గాయాలు | Nannapaneni rajakumari son-in-law injured after car slips | Sakshi
Sakshi News home page

కారు బోల్తా, నన్నపనేని అల్లుడికి గాయాలు

Published Mon, Jun 30 2014 8:30 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

కారు బోల్తా, నన్నపనేని అల్లుడికి గాయాలు - Sakshi

కారు బోల్తా, నన్నపనేని అల్లుడికి గాయాలు

హైదరాబాద్ : హైదరాబాద్ కొత్తగూడ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నన్నపనేని సుధా భర్త లతీష్ రెడ్డి గాయపడ్డారు. కారు అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొని పైనుంచి కిందకు పడిపోయింది. లతీష్ రెడ్డి విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

 

ఈ ప్రమాదంలో గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం సమీప ప్రయివేటు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ కూడా గాయపడ్డాడు. నన్నపనేని సుధా...టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కుమార్తె. ప్రమాద వార్త తెలుసుకున్న నన్నపనేని హుటాహుటీన ఆస్పత్రికి వెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement