సాక్షి, గుంటూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అశ్లీల నృత్యాల ఘటనను ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై నన్నపనేని మాట్లాడుతూ.. ‘భీమవరం ఘటన జుగుప్సాకరంగా ఉంది. ఎక్కడా అలాంటి డాన్సులకు అనుమతించం’ అని స్పష్టం చేశారు. కాగా భీమవరం యూత్ క్లబ్ వార్షికోత్సవ కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొనటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
మరోవైపు ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీపై నన్నపనేని రాజకుమారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను సురభి నాటకాల కంపెనీ ఆర్టిస్టులతో పోల్చడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. నా అనుభవం అంతలేదు ఆమె వయస్సు. అన్ని పార్టీలవారు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నా పనితీరును అభినందిస్తున్నారు. పద్మశ్రీకి దమ్ము, ధైర్యం ఉంటే తనతో బహిరంగ చర్చకు రావాలి. విశాఖ జిల్లా పెందుర్తిలో దళిత మహిళపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. ఆమెను పరామర్శించి, ప్రభుత్వ హామీ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటా’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment