recording dances
-
కూటమి నేతల హల్చల్.. కోడి పందెం, రికార్డింగ్ డ్యాన్స్..
సాక్షి, కాకినాడ: ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడో రోజు యథేచ్ఛగా కోడి పందేలు(Kodi Pandem) కొనసాగుతున్నాయి. సంక్రాంతి సంబరాల పేరిట కూటమి నేతలు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదే సమయంలో పాఠశాలలను సైతం టీడీపీ నేతలు వదలడం లేదు. స్కూల్స్‌లో కూడా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. దీంతో, స్థానికులు మండిపడుతున్నారు.ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. కూటమి నేతలే దగ్గరుండి అన్ని కార్యక్రమాలను చూసుకుంటున్నారు. అలాగే, కోడి పందేల బరుల దగ్గర జూదం కోసం స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అడ్డు అదుపు లేకుండా గుండాట, పేకాట, గ్యాంబ్లింగ్, లోనాబయటా ఆడిపిస్తున్నారు. ఇక, జూద క్రీడలు కూటమి నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. పేకాట ఆడేవాళ్లకు దగ్గరుండి మద్యం సరఫరా చేయిస్తున్నారు కూటమి నేతలు.ఇదే సమయంలో కోడి పందేలా కోసం ప్రభుత్వ పాఠశాలలను సైతం కూటమి నేతలు వదిలిపెట్టడం లేదు. తుని రూరల్ వి.కొత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో కోడి పందేలు, జూదాలు నిర్వహించారు. ఇక, కూటమి నేతల ఒత్తిళ్ళతో కోడి పందేల వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎక్కడ చూసినా జూదం ఆడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి టీడీపీ, జనసేన నేతలు కోడి పందేలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. కోడి పందేల బరుల వద్ద బెట్టింగ్‌ల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. జూద క్రీడలు, కోడి పందేల కోసం లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు.ఇదిలా ఉండగా.. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు జనసేనలో కోడి పందేలు చిచ్చురేపాయి. రాజోలులో నడి రోడ్డుపై కోడి పందెం బరుల కోసం జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్‌పై టీడీపీ, జనసేన నాయకులు ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే మాటలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన బరులు ఏర్పాటు చేసుకున్నారు జనసేన, టీడీపీ నాయకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజోలులో విచ్చలవిడిగా కోడి పందేలు, గుండాట, రికార్డింగ్ డ్యాన్స్‌లు జరిగాయి. పలుచోట్ల రాత్రి సమయంలో కూటమి నేతలే రికార్డింగ్ డ్యాన్స్‌లను ప్రోత్సహించారు. ఇంతటితో ఆగకుండా కూటమి నేతలు మరింత హల్చల్ చేశారు. ఇటీవలి కాలంలో బౌన్సర్లు ఏర్పాటు సాధారణంగా మారిన నేపథ్యంలో కోడి పందేల బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఓ అడుగు ముందుకేసిన నిర్వాహకులు మహిళా బౌన్సర్లను రంగంలోకి దింపారు. -
టీడీపీ కార్యాలయంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు.. ఐటమ్ సాంగ్‌లతో రెచ్చిపోయారు
మదనపల్లె(అన్నమయ్య జిల్లా): మదనపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో రికార్డింగ్ డ్యాన్సులు, అమ్మాయిల నృత్యాలు హోరెత్తాయి. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మత్తెక్కించే, హుషారైన ఐటమ్ సాంగ్‌లతో రెచ్చిపోయారు. చదవండి: World Stroke Day: సమయం లేదు మిత్రమా! నిమ్మనపల్లె సర్కిల్, చిత్తూరు బస్టాండ్, బెంగళూరు బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్లో జరిపిన వేడుకల్లో నడిరోడ్డుపైనే కార్యక్రమాలు ఏర్పాటుచేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే నాయకులు, అభిమానులు, కార్యకర్తల కోసం మాజీ ఎమ్మెల్యే రమేష్ ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్సులు పట్టణంలో చర్చనీయాంశమయ్యాయి. -
ఆదిలాబాద్: ఆఫీసర్స్ క్లబ్లో రికార్డింగ్ డ్యాన్సులు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లోని ఆఫీసర్స్ క్లబ్లో రికార్డింగ్ డ్యాన్సుల తతంగం ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. గత మూడు రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్ జన్మదిన వేడుకలను ఆఫీసర్స్ క్లబ్లో నిర్వహించారు. వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సు చేసేందుకు కొందరు మహిళలు మహారాష్ట్ర నుంచి వచ్చారు. బర్త్ డే వేడుకల్లో భాగంగా చిందులు వేస్తూ ఆనందంగా గడిపారు. ఆ నృత్యాలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ వేడుకలకు టీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీ నాయకులూ హాజరయ్యారు. రికార్డింగ్ డ్యాన్సులను తిలకించారు. కాగా, ఆఫీసర్స్ క్లబ్‌కు కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. పుట్టినరోజు వేడుకలు, ఇతర శుభకార్యాలు మినహా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదు. జిల్లా కేంద్రం మధ్యలోని ఈ క్లబ్లో రికార్డింగ్ డ్యా న్స్లతో వేడుకలు జరగడంపై పలువురు ఆశ్చర్యపోతున్నారు. క్లబ్ బీజేపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుడి పేరున బుకైనట్లు తెలిసింది. ఈ విషయమై కలెక్టర్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. -
టీడీపీ సమావేశంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు
కొండపి: ప్రకాశం జిల్లా కొండపిలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. టీడీపీ సమావేశంతో పాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ సోదరుడు సత్య పుట్టినరోజు వేడుకలు సైతం జరిపారు. ప్రధాన నాయకులు వచ్చే వరకు మహిళలతో రికార్డింగ్ డ్యాన్స్‌లు వేయించారు. ఐటమ్ సాంగ్స్‌కు మహిళా డ్యాన్సర్లు చిందులేశారు. మహిళలతో టీడీపీ నాయకులు ఇలా రికార్డింగ్ డ్యాన్స్‌లు వేయించటం చూసి అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారు. -
అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాకం
హైదరాబాద్: నాగోల్‌లో రికార్డు డ్యాన్సులు కలకలం సృష్టించాయి. పీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వార్సికోత్సవంలో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించింది. అమ్మాయిలు మద్యం మత్తులో చిందులు వేశారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు కంపెనీ యాజమాన్యం, ఈవెంట్ ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు. డాన్సర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: బలవంతంగా విషం తాగించి హత్య.. కోర్టులో డీఎంకే ఎంపీ లొంగుబాటు -
టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్స్‌లు
-
కొల్లేరు లంక గ్రామాల్లో అశ్లీల నృత్యాలు
సాక్షి, ఏలూరు : పవిత్రమైన పండుగ రోజున... కొల్లేరు లంక గ్రామాల్లో అశ్లీల నృత్యాలు కలకలం సృష్టించాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీరామ నవమి రోజున రికార్డింగ్ డాన్సులు హోరెత్తించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ఏలూరు మండలం గుడివాడ లంక గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్టేజ్‌పై అశ్లీల నృత్యాలు కొనసాగాయి.శ్రీరామ నవమి ఉత్సవాల పేరుతో..గ్రామ పెద్దలు రికార్డింగ్ డ్యాన్స్‌లు పెట్టించారు. ఇందుకోసం వేల్పూరు నుంచి కొంతమంది మహిళలను రప్పించారు. వారితో స్టేజ్‌పై రికార్డింగ్ డాన్సుల పేరుతో అశ్లీలంగా నృత్యం చేయించారు. కాగా పండుగ పూట రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేయడంపై స్థానిక మహిళలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేసినా...గ్రామ పెద్దలు పట్టించుకోలేదు. దీనిపై పోలీసులుకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని అయిదుగురు మహిళలు సహా 11మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమెదు చేశారు. -
మాయమాటలు... క్యాటరింగ్ పేరుతో అశ్లీల నృత్యాలు
సాక్షి, విజయవాడ : క్యాటరింగ్ పనుల పేరుతో ఓ మైనర్ బాలికతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నఇద్దరు వ్యక్తులను సింగ్ నగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. నగరంలోని సింగ్ నగర్ కు చెందిన దుర్గేశ్వరి కుమార్తె ఏడో తరగతి వరకు చదివింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. దీంతో అదే ప్రాంతానికి చెందిన ఓ కేటరింగ్ సంస్థ నిర్వాహకుడు మోనీ తన వద్ద పని చేసేందుకు కూతురును పంపాల్సిందిగా దుర్గేశ్వరిని కోరాడు. కేటరింగ్ పనుల కోసం బాలికను 20 రోజుల కిందట విజయవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు తీసుకెళ్ళాడు. మాయమాటలు చెప్పి అనకాపల్లికి చెందిన రికార్డింగ్ డ్యాన్స్ నిర్వాహకులు మైనర్ బాబు, సంధ్యలకు బాలికను అప్పగించాడు. అప్పటి నుంచి బాలికను తమ ట్రూప్‌లోని ఇతర యువతులతో కలిపి బలవంతంగా అశ్లీల నృత్యాలు చేయించడం మొదలు పెట్టారని పోలీసులు తెలిపారు. 20 రోజుల పాటు నరకం అనుభవించిన బాలిక ఆ గ్యాంగ్ నుండి తప్పించుకుని విజయవాడకు చేరుకుందనీ, అదేక్రమంలో బాలిక తల్లి కూడా తన కుమార్తె ఆచూకీ లభించడం లేదని ఫిర్యాదు చేసిందని సింగ్ నగర్ పోలీసులు వెల్లడించారు. ఈలోగా బాలిక కూడా ఇంటికి చేరడంతో.. విషయం తెలుసుకున్న పోలీసులు డాన్స్ ట్రూప్‌పై దాడి చేసి నిర్వాహకులు మైనర్ బాబు, సంధ్యలను అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ప్రమేయమున్న మిగతావారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
క్యాటరింగ్ పేరుతో అశ్లీల నృత్యాలు
-
పశ్చిమగొదావరి జిల్లాలో అశ్లీల నృత్యాలు
-
నవమి వేడుకల్లో అశ్లీల నృత్యాలు
సాక్షి, కాకినాడ : భక్తి ముసుగులో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అసాంఘీక కార్యాకలాపాలను ప్రోత్సహించారు. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇలాకలో అశ్లీల నృత్యాలను నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం రావికంపాడు గ్రామంలోలో శ్రీరామ నవమి సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అశ్లీల నృత్యాలు, గుండాటలు నిర్వహించినప్పటికీ తెలుగు తమ్ముళ్లపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
‘నా అనుభవం అంతలేదు ఆమె వయస్సు’
సాక్షి, గుంటూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అశ్లీల నృత్యాల ఘటనను ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై నన్నపనేని మాట్లాడుతూ.. ‘భీమవరం ఘటన జుగుప్సాకరంగా ఉంది. ఎక్కడా అలాంటి డాన్సులకు అనుమతించం’ అని స్పష్టం చేశారు. కాగా భీమవరం యూత్ క్లబ్ వార్షికోత్సవ కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొనటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీపై నన్నపనేని రాజకుమారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను సురభి నాటకాల కంపెనీ ఆర్టిస్టులతో పోల్చడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. నా అనుభవం అంతలేదు ఆమె వయస్సు. అన్ని పార్టీలవారు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నా పనితీరును అభినందిస్తున్నారు. పద్మశ్రీకి దమ్ము, ధైర్యం ఉంటే తనతో బహిరంగ చర్చకు రావాలి. విశాఖ జిల్లా పెందుర్తిలో దళిత మహిళపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. ఆమెను పరామర్శించి, ప్రభుత్వ హామీ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటా’ అని తెలిపారు. -
రికార్డింగ్ డ్యాన్సుల కోసం రోడ్డెక్కారు
-
రికార్డింగ్ డ్యాన్సుల కోసం రోడ్డెక్కారు
మేళ్లచెరువు: సంప్రదాయ ఉత్పవాల్లో అశ్లీల నృత్యాలు ఉండకూడదని అందరూ అనుకుంటారు. కానీ మహాశివరాత్రి ఉత్సవాల్లో రికార్డింగ్ డ్యాన్సులకు అనుమతి ఇవ్వాలని కొందరు రాస్తారోకో నిర్వహించడం విడ్డూరంగా ఉంది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గ్రామంలోని దేవాలయంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించటం ఇక్కడి ఆనవాయితీ. అయితే, ఈ ఉత్సవాల్లో అశ్లీల రికార్డింగ్ డాన్సులకు అనుమతిలేదు. దీంతో కొందరు గ్రామస్తులు గురువారం మధ్యాహ్నం కోదాడ-మేళ్లచెరువు రహదారి పై రాస్తారోకో చేపట్టారు. రికార్డింగ్ డాన్స్‌లకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసన కారణంగా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడుతున్నారు. -
గణేష్ నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు
- 9 మంది అరెస్ట్ తణుకు: గణేష్ నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు జోరుగా సాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం కోనాల గ్రామంలో వినాయక నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అసభ్యకర నృత్యాలను మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి తీసుకు వచ్చి నృత్యాలు చేయిస్తున్న ఐదుగురు నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సొమ్ములతో సరి.. చిందేసుకో మరి..!
యథేచ్ఛగా రికార్డింగ్ డ్యాన్సులు ఆర్కెస్ట్రాల ముసుగులో కార్యక్రమాలు పట్టించుకోని అధికారులు భీమవరం : డెల్టా ప్రాంతంలోని గ్రామాల్లో జాతరల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సు కార్యక్రమాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వీరవాసరం మండలంలోని ఓ గ్రామంలో జాతర సందర్భంగా రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహిస్తుండగా స్థానికులు పోలీసులకు ఫోన్ చేసినా పట్టించుకోలేదని, జాతర నిర్వాహకులు పోలీసులకు ముడుపులు అందజేయడమే కారణమనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొద్దిరోజులుగా పెళ్లిళ్లు, జాతరలు, వేడుకల సమయంలో ఆర్కెస్ట్రాలు ఏర్పాటుచేస్తున్నారు. వీటిలో పాటలకు అనుగుణంగా యువతులతో నృత్యాలు చేయించి కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కురచ దుస్తులతో యువతను పెడదారి పట్టించేలా డ్యాన్స్‌లు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇందుకు అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లతో పాటు భారీగా ముడుపులు కారణంగా కొందరు చెబుతున్నారు. పాలకొల్లు సర్కిల్ పరిధిలో.. పాలకొల్లు పోలీసు సర్కిల్ పరిధిలోని ఒక గ్రామంలో కొద్దిరోజుల క్రితం జాతర నిర్వహించారు. గరగ నృత్యాలు, బాణసంచా కాల్పులతో పాటు రికార్డింగ్ డాన్సులు హోరెత్తాయి. అసభ్యకర నృత్యాలు చేయగా ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై పోలీసు సిబ్బందిని ఆరా తీస్తే దీనిని ఆకతాయి పనిగా కొట్టిపారేసినట్టు చెబుతున్నారు. అదేరోజు రాత్రి 11 గంటల నుంచి వేకువజాము 3 గంటల వరకు రికార్డింగ్ డ్యాన్స్‌లు జరిగినట్టు ఆ గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గ్రామంలోని కట్టుబాట్ల కారణంగా వారంతా మిన్నకుండిపోయారట. ఇక్కడ దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేయించాలని ఉన్న కట్టుబాట్లు కారణంగా విషయం బయటపడితే తమకు ఇబ్బందులు తప్పవని రికార్డింగ్ డ్యాన్స్‌లను వ్యతిరేకించే కొంతమంది యువకులు కిమ్మనకుండా మిన్నకుండి పోయినట్టు తెలిసింది. -
సత్యదేవుని ఆలయంలో రికార్డింగ్ డ్యాన్సులు
అన్నవరం కొండ మీద అపచారం అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యగిరి కొండపై ఉన్న హరిహరసదన్ సత్రంలో శనివారం తెల్లవారుజామున జరిగిన వివాహ వేడుకల్లో నిర్వాహకులు అపచారానికి పాల్పడ్డారు. సత్యదేవుని సన్నిధిలో డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేయించారు. జిల్లాలోని తొండంగి మండలం దానవాయిపేట గ్రామానికి చెందిన టీడీపీ నేతకు చెందిన పెళ్లి వేడుక కావడంతో వారిని ఎవరూ నిలువరించలేకపోయారు. శనివారం తెల్లవారుజామున జరిగే గొల్లపల్లి సతీష్, దివ్యల వివాహం కో సం గత నెల 11న తొండంగి మండలం అద్దరిపేటకు చెందిన కోడె శేఖర్ ఈ స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నారు. శుక్రవారం రాత్రి నుంచే వివాహ వేడుకలు ప్రారంభమయ్యా యి. ఒకవైపు పెళ్లి విందు జరుగుతుండగానే మరోవైపు స్టేజీ మీద సినిమా పాటలకు డ్యాన్సర్ల చేత అశ్లీల నృత్యాలు చేయించారు. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు, కమిషనర్ వైవీ అనూరాధ ఈ విషయమై దేవస్థానం ఈవో నాగేశ్వరరావుకు ఫోన్ చేసి వివరాలడిగారు. చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్వాహకులపై తొండంగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఈవో తెలిపారు. నృత్యాలను నిరోధించలే కపోయారన్న కారణంగా హరిహరసదన్ గుమస్తా ఎన్.గోవింద్, సెక్యూరిటీ గార్డ్ బహదూర్‌లను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా సూపరిం టెండ్ంట్ కృష్ణప్రసాద్‌తో పాటు మరో ఇద్దరికి మెమోలు ఇచ్చినట్లు తెలిపారు. -
అశ్లీలానికి అడ్డుకట్ట
చెన్నై: ఆలయ ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలకు అడ్డుకట్ట వేయాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. వివాదాలకు ఆస్కారం లేని రీతిలో భద్రత కల్పించడం, సంప్రదాయ, భక్తితో కూడిన నృత్యాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని సూచించింది. గ్రామాల్లో జరిగే ఆలయ వేడుకల్లో ఎవరికి వారు దూకుడుగా వ్యవహరించడం, వివాదాలకు దిగడం పరిపాటిగా మారింది. ఇటీవల కాలంగా ఆలయ ఉత్సవాల్లో వివాదం, రగడ అంటూ లేని ప్రదేశాలు లేవు. ప్రధానంగా ఈ వేడుకల్లో కరగాటం, కోలాటంలతో పాటుగా అశ్లీల నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వలన ఆకతాయిల వీరంగాలు వివాదాలకు దారి తీస్తూ వస్తున్నాయి. ఈ వివాదాలకు తోడుగా సామాజిక వర్గాల మధ్య భగ్గుమనే ఆగ్రహం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. భద్రతను ఎంత కట్టుదిట్టం చేసినా ఈ నృత్యాల రూపంలో వివాదాలు రాజు కుంటుండటంతో వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఆలయ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తిరుచంగోడుకు చెందిన దివాకర్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ మంగళవారం న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించాలే గానీ, వేడుకల పేరుతో అశ్లీల నృత్య ప్రదర్శనలు ఏర్పాట్లు చేస్తే కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అశ్లీల నృత్యాలకు అడ్డుకట్ట వేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అశ్లీల నృత్యాలు, ప్రదర్శనలకు ఏర్పాటు చేస్తే నిర్వాహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
పండగ సంబరాల్లో.. ఎమ్మెల్యే డాన్సులు
పెద్ద పండగ అంటే చాలు.. కోనసీమలో సంబరాలు మిన్నంటుతాయి. ఆ సంబరాలకు చిన్నా పెద్దా తేడా ఉండదు. అందుకే ఓ ఎమ్మెల్యే గారు చిందేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి... పండుగ సందర్భంగా నిర్వహించిన రికార్డింగు డ్యాన్సులో డాన్సర్లతో కలిసి బ్రహ్మాండంగా స్టెప్పులేశారు. 'నీ ఇల్లు బంగారం కాను.. నా ఒళ్లు సింగారం కాను' అనే పాటకు డాన్సులు చేసి తన ప్రతిభను నిరూపించుకున్నారు. పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లిలో జరిగిన రికార్డింగ్ డ్యాన్సులలో ఆయన కూడా పాల్గొని అక్కడున్న అమ్మాయిలతో చేతులు కలిపి డాన్సులు చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోనసీమలో యథేచ్ఛగా కోడిపందాలు, గుండాటలు, రికార్డింగ్ డాన్సులు జరిగాయి. సాధారణంగా రాత్రిపూట నిర్వహించే రికార్డింగ్ డ్యాన్సులు ఈసారి అధికార పార్టీ నేతల అండదండలతో పగలే మొదలు పెట్టేశారు. వాడ్రేవుపల్లి. మగటనల్లి, కేశనపల్లి, శంకరగుప్తంలలో అశ్లీల నృత్యాలు చోటుచేసుకున్నాయి. వాడ్రేవుపల్లిలో జరిగిన రికార్డింగ్ డ్యాన్సులో పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పాల్గొన్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యే డ్యాన్స్ చేయడంతో అక్కడున్న వారు విస్తుపోయారు. -
కోనసీమలో జోరుగా అశ్లీల నృత్యాలు
ఎప్పుడూ పచ్చదనంతో కళకళ్లాడే కోనసీమ అశ్లీల నృత్యాల అడ్డాగా మారిపోయింది. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని మగటపల్లి, కేశనపల్లి, శంకరగుప్తంలలో యథేచ్ఛగా రికార్డింగ్ డాన్సులు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలావుంటే ఇక రాష్ట్ర పరిస్థితేంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ కొంత మంది రాజకీయ నాయకులకు తెలిసి జరుగుతున్న వ్యవహారాలేననేది ఇక్కడ బహిరంగ రహస్యమే. అశ్లీల నృత్యాలు పతాక స్థాయికి చేరినప్పటికీ పోలీసులు తమకు పట్టనట్టు వ్యవహరించడం కొసమెరుపు. -
రికార్డింగ్ డాన్సులు అడ్డుకున్న పోలీసులు
విశాఖ : విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం హరిపురంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గ్రామ దేవత సంబరాల్లో భాగంగా గ్రామస్తులు రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవటంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. రికార్డింగ్ డాన్సులకు అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. -
చిందేసిన తెలుగు తమ్ముళ్లు
-
చిందేసిన తెలుగు తమ్ముళ్లు
ఒంగోలు : ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ కార్యకర్తలు తమదైన శైలిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేసి రికార్డింగ్ డ్యాన్స్‌ల్లో మునిగి తేలారు. చాలాసేపు అమ్మాయిలు చిందులేస్తుంటే... నేతలు, కార్యకర్తలు నేత్రానందం పొందారు. అయితే మండల అధ్యక్షుడు బేరి పుల్లారెడ్డి, పామూరు సర్పంచ్ మనోహర్ ఓ అడుగు ముందుకు వేసి వేదిక పైకి ఎక్కి అమ్మాయిలతో కలిసి చిందులేశారు. మమ్మల్ని చూడండి....మా పార్టీ తీరు చూడండంటూ చిందులేశారు. అమ్మాయిల చేతులు పట్టుకుని ఊగిపోయారు. ఓ నేత అయితే ఏకంగా నృత్యం చేస్తున్న అమ్మాయి మెడలో పూలమాల వేసి మరీ ఆనందపడ్డాడు. కాగా ఈ ఘటనపై పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నా బయటకు మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. ఓ వైపు పార్టీ నేత నీతులు చెబుతుంటే...మరోవైపు తెలుగు తమ్ముళ్ల తీరును చూసి ముక్కన వేలేసుకుంటున్నారు.