కోనసీమలో జోరుగా అశ్లీల నృత్యాలు | recording dances in east godavari | Sakshi
Sakshi News home page

కోనసీమలో జోరుగా అశ్లీల నృత్యాలు

Published Fri, Jan 16 2015 7:39 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

recording dances in east godavari

ఎప్పుడూ పచ్చదనంతో కళకళ్లాడే కోనసీమ అశ్లీల నృత్యాల అడ్డాగా మారిపోయింది. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని మగటపల్లి, కేశనపల్లి, శంకరగుప్తంలలో యథేచ్ఛగా రికార్డింగ్ డాన్సులు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలావుంటే ఇక రాష్ట్ర పరిస్థితేంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ  కొంత మంది రాజకీయ నాయకులకు తెలిసి జరుగుతున్న వ్యవహారాలేననేది ఇక్కడ బహిరంగ రహస్యమే. అశ్లీల నృత్యాలు పతాక స్థాయికి చేరినప్పటికీ పోలీసులు తమకు పట్టనట్టు వ్యవహరించడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement