సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లోని ఆఫీసర్స్ క్లబ్‌లో రికార్డింగ్ డ్యాన్సుల తతంగం ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. గత మూడు రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్ జన్మదిన వేడుకలను ఆఫీసర్స్ క్లబ్‌లో నిర్వహించారు. వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సు చేసేందుకు కొందరు మహిళలు మహారాష్ట్ర నుంచి వచ్చారు. బర్త్ డే వేడుకల్లో భాగంగా చిందులు వేస్తూ ఆనందంగా గడిపారు. ఆ నృత్యాలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ వేడుకలకు టీఆర్‌ఎస్, బీజేపీ, ఇతర పార్టీ నాయకులూ హాజరయ్యారు. రికార్డింగ్ డ్యాన్సులను తిలకించారు.
కాగా, ఆఫీసర్స్ క్లబ్‌కు కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. పుట్టినరోజు వేడుకలు, ఇతర శుభకార్యాలు మినహా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదు. జిల్లా కేంద్రం మధ్యలోని ఈ క్లబ్‌లో రికార్డింగ్ డ్యా న్స్‌లతో వేడుకలు జరగడంపై పలువురు ఆశ్చర్యపోతున్నారు. క్లబ్ బీజేపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుడి పేరున బుకైనట్లు తెలిసింది. ఈ విషయమై కలెక్టర్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment