Officers Club
-
ఆదిలాబాద్: ఆఫీసర్స్ క్లబ్లో రికార్డింగ్ డ్యాన్సులు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లోని ఆఫీసర్స్ క్లబ్లో రికార్డింగ్ డ్యాన్సుల తతంగం ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. గత మూడు రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్ జన్మదిన వేడుకలను ఆఫీసర్స్ క్లబ్లో నిర్వహించారు. వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సు చేసేందుకు కొందరు మహిళలు మహారాష్ట్ర నుంచి వచ్చారు. బర్త్ డే వేడుకల్లో భాగంగా చిందులు వేస్తూ ఆనందంగా గడిపారు. ఆ నృత్యాలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ వేడుకలకు టీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీ నాయకులూ హాజరయ్యారు. రికార్డింగ్ డ్యాన్సులను తిలకించారు. కాగా, ఆఫీసర్స్ క్లబ్‌కు కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. పుట్టినరోజు వేడుకలు, ఇతర శుభకార్యాలు మినహా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదు. జిల్లా కేంద్రం మధ్యలోని ఈ క్లబ్లో రికార్డింగ్ డ్యా న్స్లతో వేడుకలు జరగడంపై పలువురు ఆశ్చర్యపోతున్నారు. క్లబ్ బీజేపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుడి పేరున బుకైనట్లు తెలిసింది. ఈ విషయమై కలెక్టర్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. -
ఆఫీసర్స్ క్లబ్లో సభ్యుడి హల్చల్
∙మద్యం మత్తులో పలువురితో అసభ్యకర ప్రవర్తన ∙మూడు నెలల పాటు సస్పెన్షన్ ? ∙సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు వరంగల్ : వరంగల్ ఆఫీసర్స్ క్లబ్లో మూడు రోజుల క్రితం కొంతమందితో గొడవకు దిగిన ఓ సభ్యున్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆదేశించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వరంగల్ నగరంలో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకుగానూ ఈ నెల 4న ఓ సభ్యు డు కుటుంబసమేతంగా వచ్చి, ఆఫీసర్స్ క్లబ్‌లోని గదిలో బస చేశాడు. అదే రోజు క్లబ్లో ఉన్న మరో సభ్యుడు వారితో దురుసుగా మా ట్లాడాడు. అంతటితో ఊరుకోకుండా పోలీసులను పిలుచుకొని వచ్చి సదరు కుటుంబ సభ్యుల వివరాలను ఆరా తీయించాడు. వారు వివాహానికి వచ్చారని ధ్రువీకరణ కావడంతో పోలీసులు వెళ్లిపోయారు. మద్యం మత్తులో మళ్లీ అర్ధరాత్రి వచ్చి రూమ్ తట్టి లేపి మరీ బస చేసిన కుటుంబీకులను యక్షప్రశ్నలతో వేధిం చాడు. క్లబ్ సిబ్బంది జోక్యం చేసుకొని అతన్ని అక్కడి నుంచి పంపించారు. అయితే క్లబ్లో బస చేసిన కుటుంబానికి సైతం రాజకీయ పలుకుబడి ఉండటంతో.. వారు సీపీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఘటనపై దర్యాప్తునకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆఫీసర్స్ క్లబ్లో బస చేసిన కుటుంబీకులు తమతో గొడవకు దిగిన వ్యక్తిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే దీని నుంచి ఎలాగోలా బయటపడేందుకు సదరు వివాదాస్పద సభ్యుడు పలువురు ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు అధికార పార్టీలోని ప్రముఖ నాయకుడికి సంబంధించిందని ఆలస్యంగా తెలియడంతో.. ప్రస్తుతం సదరు ప్రజాప్రతినిధులు కూడా గొడవకు దిగిన సభ్యుడి తరఫున పైరవీలు చేసేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అసభ్యంగా ప్రవర్తించిన సభ్యున్ని క్లబ్ నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేయాలని క్లబ్ కార్యవర్గం నిర్ణయించినట్లు పలువురు పేర్కొంటున్నారు. అతడి సభ్యత్వాన్ని పూర్తిస్థాయిలో తొలగించడంపై దృష్టిసారించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. -
గుడివాడ ఆఫీసర్స్ క్లబ్‌పై పోలీసుల దాడి
గుడివాడ (కృష్ణా) : కృష్ణా జిల్లా గుడివాడలోని ఆఫీసర్స్ క్లబ్‌పై శనివారం మధ్యాహ్నం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరుషంగా మాట్లాడారనే కారణంతో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఉండటంతో పై స్థాయిలో పైరవీలు మొదలయ్యాయి. కాగా తమ వారిని విడిపించుకునేందుకు చేసిన ప్రయత్నాలు సఫలమై...నేతలకు బదులు మిగతావారిని పోలీసుల అదుపులో ఉంచేందుకు అంగీకారం కుదిరిందని సమాచారం. అరెస్టుల వివరాలు కొద్దిసేపట్లో పోలీసులు మీడియా ముందు వెల్లడించనున్నారు. -
బ్యాడ్మింటన్ క్రీడాకారులకు సన్మానం
రాజమండ్రి(స్పోర్ట్స్): రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులు రాజమండ్రి ఆఫీసర్స్ క్లబ్లో సన్మానం జరిగింది. రాష్ట్ర స్థాయిలో బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక అయిన వివిధ కేటగిరీ విద్యార్థులకు ఎమ్మెల్యే ఆకుల సత్యానారాయణ అభినందనలు తెలిపారు. అనంతరం క్రీడాకారులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
నగరంలోనే పోలీస్ బాస్
ఇరిగేషన్ ఎస్ఈ బంగళాలో డీజీపీ క్యాంపు కార్యాలయం ఆఫీసర్స్ క్లబ్ కూడా కేటాయింపు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం విజయవాడ సిటీ : రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ (డిజీపీ) క్యాంపు కార్యాలయం ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు పోలీసు శాఖ సమాయత్తమవుతోంది. ఇటీవల వార్షిక నేర నివేదిక విడుదల కార్యక్రమం కోసం నగరానికి వచ్చిన డీజీపీ జె.వి.రాముడు ఇక్కడ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు ఇంకా సమయం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో సోమవారం ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో డీజీపీ క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. నేడు సీఎస్ రాక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు మంగళవారం నగరానికి రానున్నట్టు అధికార వర్గాల సమాచారం. మధ్యాహ్నం 2గంటలకు నగరానికి చేరుకొని గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఎంపిక చేసిన ప్రాంతాలను పరిశీలించి ఖరారు చేస్తారు. రాష్ట్ర గవర్నరు, ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమం నిర్వహణ, భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేస్తారు. తదుపరి బుధవారం ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమంపై అధికారులతో సమావేశమై చర్చిస్తారు. ప్రధాన కార్యదర్శితో పాటు గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ప్రాంతం ఎంపిక కోసం డీజీపీ జె.వి.రాముడు కూడా వచ్చే అవకాశం ఉందని కమిషనరేట్ అధికారుల సమాచారం. అయితే అధికారికంగా ఆయన పర్యటన ఖరారు కాలేదు.