
టీడీపీ ఆఫీసులో డ్యాన్స్ చేస్తున్న యువతులు
శుక్రవారం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మత్తెక్కించే, హుషారైన ఐటమ్ సాంగ్‌లతో రెచ్చిపోయారు.
మదనపల్లె(అన్నమయ్య జిల్లా): మదనపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో రికార్డింగ్ డ్యాన్సులు, అమ్మాయిల నృత్యాలు హోరెత్తాయి. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మత్తెక్కించే, హుషారైన ఐటమ్ సాంగ్‌లతో రెచ్చిపోయారు.
చదవండి: World Stroke Day: సమయం లేదు మిత్రమా!
నిమ్మనపల్లె సర్కిల్, చిత్తూరు బస్టాండ్, బెంగళూరు బస్టాండ్, ఎన్‌టీఆర్ సర్కిల్‌లో జరిపిన వేడుకల్లో నడిరోడ్డుపైనే కార్యక్రమాలు ఏర్పాటుచేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే నాయకులు, అభిమానులు, కార్యకర్తల కోసం మాజీ ఎమ్మెల్యే రమేష్ ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్సులు పట్టణంలో చర్చనీయాంశమయ్యాయి.