
సాక్షి, ఏలూరు : పవిత్రమైన పండుగ రోజున... కొల్లేరు లంక గ్రామాల్లో అశ్లీల నృత్యాలు కలకలం సృష్టించాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీరామ నవమి రోజున రికార్డింగ్ డాన్సులు హోరెత్తించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ఏలూరు మండలం గుడివాడ లంక గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్టేజ్‌పై అశ్లీల నృత్యాలు కొనసాగాయి.శ్రీరామ నవమి ఉత్సవాల పేరుతో..గ్రామ పెద్దలు రికార్డింగ్ డ్యాన్స్‌లు పెట్టించారు. ఇందుకోసం వేల్పూరు నుంచి కొంతమంది మహిళలను రప్పించారు. వారితో స్టేజ్‌పై రికార్డింగ్ డాన్సుల పేరుతో అశ్లీలంగా నృత్యం చేయించారు. కాగా పండుగ పూట రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేయడంపై స్థానిక మహిళలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహం వ్యక‍్తం చేసినా...గ్రామ పెద్దలు పట్టించుకోలేదు. దీనిపై పోలీసులుకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని అయిదుగురు మహిళలు సహా 11మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమెదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment