రికార్డింగ్ డ్యాన్సుల కోసం రోడ్డెక్కారు
మేళ్లచెరువు: సంప్రదాయ ఉత్పవాల్లో అశ్లీల నృత్యాలు ఉండకూడదని అందరూ అనుకుంటారు. కానీ మహాశివరాత్రి ఉత్సవాల్లో రికార్డింగ్ డ్యాన్సులకు అనుమతి ఇవ్వాలని కొందరు రాస్తారోకో నిర్వహించడం విడ్డూరంగా ఉంది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గ్రామంలోని దేవాలయంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించటం ఇక్కడి ఆనవాయితీ.
అయితే, ఈ ఉత్సవాల్లో అశ్లీల రికార్డింగ్ డాన్సులకు అనుమతిలేదు. దీంతో కొందరు గ్రామస్తులు గురువారం మధ్యాహ్నం కోదాడ-మేళ్లచెరువు రహదారి పై రాస్తారోకో చేపట్టారు. రికార్డింగ్ డాన్స్‌లకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసన కారణంగా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడుతున్నారు.