గణేష్ నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు
- 9 మంది అరెస్ట్
తణుకు: గణేష్ నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు జోరుగా సాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం కోనాల గ్రామంలో వినాయక నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అసభ్యకర నృత్యాలను మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి తీసుకు వచ్చి నృత్యాలు చేయిస్తున్న ఐదుగురు నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.