sunkara padmasri
-
‘నా అనుభవం అంతలేదు ఆమె వయస్సు’
సాక్షి, గుంటూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అశ్లీల నృత్యాల ఘటనను ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై నన్నపనేని మాట్లాడుతూ.. ‘భీమవరం ఘటన జుగుప్సాకరంగా ఉంది. ఎక్కడా అలాంటి డాన్సులకు అనుమతించం’ అని స్పష్టం చేశారు. కాగా భీమవరం యూత్ క్లబ్ వార్షికోత్సవ కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొనటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీపై నన్నపనేని రాజకుమారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను సురభి నాటకాల కంపెనీ ఆర్టిస్టులతో పోల్చడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. నా అనుభవం అంతలేదు ఆమె వయస్సు. అన్ని పార్టీలవారు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నా పనితీరును అభినందిస్తున్నారు. పద్మశ్రీకి దమ్ము, ధైర్యం ఉంటే తనతో బహిరంగ చర్చకు రావాలి. విశాఖ జిల్లా పెందుర్తిలో దళిత మహిళపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. ఆమెను పరామర్శించి, ప్రభుత్వ హామీ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటా’ అని తెలిపారు. -
‘రావెలపై చంద్రబాబు విచారణకు ఆదేశించాలి’
విజయవాడ: మహిళలను వేధిస్తున్న మంత్రి రావెల కిశోర్ బాబును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మ డిమాండ్ చేశారు. ఆమె శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ మంత్రి రావెలపై విచారణకు ఆదేశించాలన్నారు. గతంలో రావెల కుమారులు కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని సుంకర పద్మ అన్నారు. మహిళల పట్ల టీడీపీకి, చంద్రబాబుకు ఉన్న గౌరవం ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. కాగా ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ల మధ్య చోటు చేసుకున్న వివాదంపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. తనను రావెల హత్య చేయించేందుకు యత్నించారంటూ జానీ మూన్ ఆరోపించడంతో దానిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జీవీ ఆంజనేయులుతో కూడిన ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. -
ఏపీకి పద్మశ్రీ.. తెలంగాణకు శారద
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను నియమించింది. ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుంకర పద్మశ్రీని, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నేరెళ్ల శారదను నియమించారు. సోమవారం ఏఐసీసీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తొమ్మిది రాష్ట్రాలకు మహిళ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు.