త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తనకూ ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీ, అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో ఆమె బాబును కలిశారు.
చంద్రబాబుకు నన్నపనేని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తనకూ ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీ, అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో ఆమె బాబును కలిశారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు నియోజకవర్గం లేదు కనుక రాజ్యసభకు వెళ్లే అవకాశమివ్వాలని కోరారు. వీలుకాకుంటే గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, లే దా నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్నారు.