
తహశీల్దార్‌పై దాడిని ఎవరూ సమర్థించరు
కృష్ణా జిల్లాలో మహిళా తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడాన్ని ఎవరూ సమర్థించరని
నన్నపనేని రాజకుమారి
తిరుమల: కృష్ణా జిల్లాలో మహిళా తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడాన్ని ఎవరూ సమర్థించరని శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. శుక్రవారం ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ దాడి చేయడం మంచి పద్ధతి కాదని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ విచారం వ్యక్తం చేశారు.
గతంలో తనపై కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు వస్తుంటాయన్నారు. ఈ ఘటనపై తాను కూడా వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. రాష్ట్ర నూతన రాజధాని అమరావతి త్వరగా పూర్తి కావాలని కోరుకున్నానన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా టీటీడీ తనవంతుగా సంపూర్ణం సహకారం అందిస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండేలా చూడాలని శ్రీవారిని కోరుకున్నానని చెప్పారు.