సీమాంధ్రులు... క్షమించండి: నన్నపనేని | Seemandhra people sorry , says Nannapaneni Rajakumari | Sakshi
Sakshi News home page

సీమాంధ్రులు... క్షమించండి: నన్నపనేని

Published Thu, Feb 27 2014 12:35 PM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

నన్నపనేని రాజకుమారి - Sakshi

నన్నపనేని రాజకుమారి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు చేసిన 'సమైక్యాంధ్ర పోరాటం'లో టీడీపీ ఓడిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకురాలిగా సీమాంధ్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు.  రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై  న్యాయస్థానంలో తమ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తామన్నారు.

 

రాష్ట్ర విభజన వద్దని తమ పార్టీ కొనసాగించిన పోరాటాన్ని ఆమె ఈ సందర్భంగా విశదీకరించారు. విభజన బిల్లు తప్పులు తడఖ అని అటు విధాన సభ, ఇటు విధాన మండలి రాష్ట్రపతికి తిప్పి పంపామని, అయిన  పార్లమెంట్ ఉభయ సభలలో ఆ బిల్లు ఆమోదం పొందిందని ఈ సందర్భంగా నన్నపనేని  కాంగ్రెస్ పార్టీ అనుసరించిన  వైఖరిపై నిప్పులు చెరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement