శాసనమండలిలో మంగళవారం అత్తారింటికి దారేదీ.. అంటూ ఆసక్తికర చర్చ జరిగింది. వినేందుకు విడ్డూరంగా ఉన్నా.. పెద్దల సభలో.. కాసేపు.. నన్నపనేని రాజకుమారి సందడి చేశారు. దీంతో.. సభలో కాసేపు నవ్వులు పూసాయి. రాష్ట్ర విభజన బిల్లుపై జరిగిన ఆ సరదా సంభాషణను అందరూ నవ్వుతూ ఆస్వాదించారు. రాజకుమారి మాట్లాడుతూ తెలంగాణ-సీమాంధ్ర ప్రాంతాల్లో బంధుత్వాలు కొనసాగుతున్నాయని... బంధాలు బంధుత్వాల్లో భేదం చూపించలేదని.... మరి ఇప్పుడు రాష్ట్ర విభజన ఎందుకు కోరుకుంటున్నారో చెప్పాలన్నారు. ఈ సందర్బంగా ఆమె నేతల బంధుత్వాలను గుర్తు చేశారు.
Published Tue, Jan 21 2014 3:40 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement