రెండు వేల కోట్ల బాగోతం బయటపడితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదని మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంత జరిగినా తేలు కుట్టిన దొంగల్లా ఎందుకున్నారని.. దీని వెనుక అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. నిప్పు లాంటి వాడినని చంద్రబాబు చెప్పుకుంటారని.. ఇప్పుడు ఆ నిప్పుకు తుప్పు పట్టిందని ఎద్దేవా చేశారు. ఇంకా ఎన్ని అక్రమాలు జరిగాయో నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న ఉద్యోగి వద్దే రూ.2 వేల కోట్లు ఉంటే రాష్ట్రాన్ని చంద్రబాబు ఏవిధంగా పరిపాలించాడో అర్థం చేసుకోవచ్చన్నారు.