
నన్నపనేని రాజకుమారి
కృష్ణాజిల్లా : చందర్లపాడు (మం) తోటరావులపాడు గ్రామంలో తండ్రిచేతిలో దారుణ హత్యకు గురైన చంద్రిక కుటుంబాన్ని మహిళా కమీషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. చంద్రిక ప్రేమించిన వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుండగా సహించలేని తండ్రి దారుణంగా హతమార్చాడు. అలాంటి వ్యక్తిని చంద్రిక తల్లి, చెల్లి చాలా మంచివాడని, విడిపించాలని అడగటం ఆశ్చర్యంగా ఉందని నన్నపనేని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడికి వారు వత్తాసు పలకడం నచ్చలేదని, చట్టంముందు ఎవరైనా ఒకటేనని అన్నారు. పోలీసులు సరైన సాక్ష్యాలు సేకరించి తొండపు కోటయ్యకు కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment