Honor killings case
-
వెంటాడి చంపేస్తున్నారు.. మొన్న భువనగిరి, నిన్న సరూర్‌నగర్, నేడు బేగంబజార్..
సాక్షి, హైదరాబాద్: భువనగిరి జిల్లా లింగ రాజుపల్లికి చెందిన ఎరుకుల రామకృష్ణ మరో కులానికి చెందిన భార్గవిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత కూడా భర్తను వదిలేయమని పలుమార్లు కూతురిని బెదిరించినా వినకపోవటంతో అల్లుడిని మట్టుబెట్టాలని మామ పల్లెపాటి వెంకటేష్ నిర్ణయించుకున్నాడు. సిద్దిపేటకు చెందిన లతీఫ్ గ్యాంగ్‌కు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి దారుణంగా చంపించాడు. ►సరూర్‌నగర్‌కు చెందిన బి.నాగరాజు అన్య మతానికి చెందిన అశ్రిన్ సుల్తానాను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. దీంతో కక్ష కట్టిన అశ్రిన్ అన్నయ్య మహ్మద్ మొబిన్ అహ్మద్, తన బావ (మరో సోదరి భర్త) మహ్మద్ మసూద్ అహ్మద్‌తో కలిసి సరూర్‌నగర్‌లో నడి రోడ్డు మీద నాగరాజు పై సెంట్రిగ్ రాడ్, కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చాడు. ►బేగంబజార్ కోల్సావాడికి చెందిన నీరజ్ పన్వార్, వేరే కులానికి చెందిన సంజనను ప్రేమించాడు. వీరి ప్రేమను పెద్దలు నిరాక రించడంతో ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసు కొని పాతబస్తీ శంషీర్‌గంజ్‌లో ఉంటు న్నారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య వైరం మొదలైంది. శుక్రవారం రాత్రి నీరజ్ తాతతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. చేపల మార్కెట్ సమీపంలో నలుగురు దుండ గులు నీరజ్‌ను చుట్టుమట్టు కత్తులతో పొడిచి, రాళ్లతో మోది హత్య చేశారు. ఇలా భాగ్యనగరం పరువు హత్యలతో తల్ల డిల్లుతోంది. చంపేది, చంపించేది అండగా ఉండాల్సిన కుటుంబీకులే కావటం విషాద కరం. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తండ్రి, వేరే మతస్తుడిని మనువాడిందని అన్న, వేరే కులస్తుడిని వివాహం చేసుకుందని మొత్తం కుటుంబమే కక్షగట్టి పరువు హత్య లకు పాల్పడుతున్నారు. చదవండి: చంద్రుడిని చూశారుగా? ఎంత పెద్దగా కనిపిస్తున్నాడో.. ఎక్కడో తెలుసా! హత్యలకు సాంకేతికత వినియోగం.. పోలీసులకు దొరికిపోతామని, అరెస్ట్ చేసి జైలుకెళతామని తెలిసినా ఏమాత్రం బెదరడం లేదు. పైకి ప్రేమను నటిస్తూనే ఎప్పుడు చంపాలి? ఎలా చంపాలి? పక్కా ప్రణాళికలు రచించి, అనువైన సమయంలో అంతమొంది స్తున్నారు. సొంత వారిని మట్టుబెట్టేందుకు నిందితులు సాంకేతికతను కూడా వినియోగి స్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ల కదలికలను ఆరా తీస్తున్నారు. నాగరాజు మర్డర్ కేసులో జరిగిందిదే. ఎలాగైనా చెల్లిలి భర్తను అంత మొందించాలని నిర్ణయించుకున్న మొబిన్.. నాగరాజు సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేశాడు. ఇందు కోసం ఈ– మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సం పాదించి తద్వారా సెల్‌ఫోన్‌ను ట్రాకింగ్ చేశా డు. అనువైన సమయం చూసి హత్య చేశాడు. ఫొటోలు, వీడియోలు తీస్తూ జనాలు.. పరువు హత్యలు జరుగుతున్నదో ఎక్కడో శివారు ప్రాంతాల్లో కాదు, నడిరోడ్ల మీద. కిక్కిరిసిన ట్రాఫిక్‌లో ఏమాత్రం బెరుకు, భయం లేకుండా నిందితులు హత్య చేస్తు న్నారు. హత్య జరిగే సమయంలో చుట్టూ జనాలు ఉన్నా ఏమాత్రం కాపాడే ప్రయత్నం చేయకుండా సెల్ఫోన్లో ఫొటోలు, వీడి యోలు తీస్తూ నిశ్చేష్టులుగా ఉండిపోతు న్నారు. సరూర్‌నగర్‌లో నడిరోడ్డు మీద నాగ రాజును మొబిన్ హత్య చేస్తుంటే సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ ఉండిపోయారే తప్ప ఒక్కరైనా స్పందించి ఉంటే తన భర్త నాగరాజు బతికే వాడని అశ్రిన్ రోదించడం, మనిషిలో మాన వత్వం చనిపోయిందనడానికి ఇదో ఉదాహరణ. చట్టాలు, పోలీసులు డోంట్ కేర్.. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారన్న అక్కసు తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. దీనికి తోడు బంధువులు, స్నేహితుల సూటిపోటి మాటలతో వారిలో కోపం మరింత కట్టలు తెంచుకుంటుంది. దీంతో హత్యలు చేయ డానికైనా, చేయించేందుకైనా వెనకా డట్లేదు. క్షణికావేశంలో హత్యలు చేసి, జీవితకాలం శిక్ష విధించుకుంటున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. చట్టాలు, పోలీసులంటే గౌరవం, భయం లేకుండా పోయింది. పరువు హత్యల కేసుల్లో నిందితులు త్వరగానే పట్టుబడుతుండటం గమనార్హం. -
పరువు హత్య కేసు: యువరాజ్, అరుణ్‌కు మరణించే వరకు జైలు
సాక్షి, చెన్నై: సేలం జిల్లా ఓమలూరు ఇంజినీరింగ్ విద్యార్ధి గోకుల్ రాజ్ పరువు హత్య కేసులో మంగళవారం తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో ఓ సామాజిక వర్గానికి చెందిన యువజన నేత యువరాజ్, ఆయన డ్రైవర్ అరుణ్ కుమార్‌కు మరణించే వరకు జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి సంపత్‌కుమార్ తీర్పు చెప్పారు. వివరాలు.. సేలం జిల్లా ఓమలూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి గోకుల్‌రాజ్ 2015లో పరువు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సమయంలో డీఎస్పీ విష్ణు ప్రియ బలన్మరణానికి పాల్పడటం పలు అనుమానాలకు దారి తీసింది. దీంతో ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించారు. ఈకేసులో ప్రధాన నిందితుడిగా అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన యువజన నేత యువరాజ్‌ను గుర్తించారు. అతడి డ్రైవర్ అరుణ్‌కుమార్‌ను రెండో నిందితుడిగా చేర్చారు. దీంతో కేసును నామక్కల్ నుంచి మదురై ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. ఏడేళ్ల పాటు జరిగిన విచారణ గత వారం ముగిసింది. తీర్పుపై ఉత్కంఠ.. ఈ కేసు తీర్పును మంగళవారం మధ్యాహ్నం న్యాయమూర్తి సంపత్‌కుమార్ వెలువరించారు. యువరాజ్‌కు మూడు యావజ్జీవ శిక్షతో పాటుగా మరణించే వరకు జైలు శిక్షను విధించారు. అరుణ్‌కుమార్‌కు రెండు యావజ్జీవాలు, మరణించే వరకు జైలు శిక్ష ఇస్తూ తీర్పు చెప్పారు. అలాగే, ఈ కేసులో నిందితులుగా ఉన్న కుమార్, సతీష్, రఘు, రంజిత్, సెల్వరాజ్ , చంద్రశేఖర్ , ప్రభు, శ్రీథర్, గిరిధర్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. ఇక, శిక్ష పడ్డ వారందరికీ తీర్పు పునః పరిశీలనకు గానీ, క్షమాభిక్షకు గానీ అవకాశం లేకుండా తీర్పులో ప్రత్యేక అంశాలు పేర్కొన్నారు. అలాగే, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా జరిమానా విధించారు. అయితే, అప్పీలుకు వెళ్లే అవకాశం మాత్రం ఉండటం గమనార్హం. అయితే, ఈ కేసులో ఐదుగురు తప్పించుకున్నారని వారికి కూడా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని గోకుల్ రాజ్ తల్లి చిత్ర విజ్ఞప్తి చేశారు. ఈ తీర్పు సమయంలో కోర్టు ఆవరణలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. చదవండి: జయలలిత మరణం మిస్టరీ: పన్నీరుకు సమన్లు.. -
తండ్రిలా తనకు తోడుంటా..
తమిళనాడు పరువుహత్య బాధితురాలు కౌశల్య కొత్త జీవితానికి నాంది పలికారు. భర్త శంకర్ హత్యతో కుంగిపోకుండా పడిలేచిన కెరటంలా సాంఘిక ఉద్యమాల్లో చురుగాగా పొల్గొంటూ అందరినీ ఆకట్టుకున్న కౌశల్య తాజాగా మరోసారి ఆదర్శనీయంగా నిలిచారు. తన జీవితంలో చోటు చేసుకున్న అత్యంత విషాదం నుంచి కోలుకుని సరికొత్త జీవితానికి తొలి అడుగు వేశారు. తన తోటి కళాకారుడు, కార్యకర్త శక్తిని ఆదర్శ వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని తందై పెరియార్ ద్రవిడగర్ కజగం ప్రధాన కార్యాలయంలో ఆదివారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పలువురు పెరియార్ ఉద్యమ కారులు, ఇతర సామాజిక ఉద్యమ నాయకులు ఈ వివాహానికి హాజరై కౌశల్య, శక్తిలకు అభినందనలు తెలిపారు. తండ్రిలా తోడుంటా.. కుల దురహంకారానికి బలైపోయిన కౌశల్య ‘శంకర్ సోషల్ జస్టిస్ ఫౌండేషన్’ పేరుతో కులానికి, మతానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు ఉద్యమంలో పరిచయమైన కార్యకర్త శక్తిని వివాహం చేసుకున్నారు. శంకర్ ఫౌండేషన్‌తో తనకు ఎలాంటి సంబంధంలేకపోయినా,ఆ ఉద్యమంలో ఎలాంటి అవరోధం కల్పించకుండా, తండ్రిలాగా కౌశల్యకు అండగా ఉంటానని శక్తి ప్రకటించారు. మరోవైపు ఉద్యమాల్లో రాజకీయంగా శక్తికి అండగా ఉంటూనే పరువు హత్యలకు వ్యతిరేకంగా ఒక చట్టం వచ్చేంతవరకు పోరాడతానని కౌశల్య స్పష్టం చేశారు. కాగా 2016లోదళిత యువకుడిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో కౌశల్య భర్త శంకరును ఆమె తల్లిందండ్రులు అతికిరాతంగా హత్య చేశారు. 19 సం.రాల వయసులో శంకర్‌తో నూతన జీవితాన్ని ప్రారంభించిన కేవలం 9నెలల కాలంలో ఎదురైన ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న కౌశల్య శంకర్ హంతకులకు శిక్షపడేలా పోరాడింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12, 2017న నేరస్తులకు మరణశిక్ష విధిస్తూ తిరుప్పూర్ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. More power to couples like this! This was the best thing I heard today. pic.twitter.com/IkIPstRjqN — Megha Kaveri (@meghakaveri) December 9, 2018 Post-wedding celebration with parai isai. pic.twitter.com/jtBLk0HNSJ — Megha Kaveri (@meghakaveri) December 9, 2018 -
నిందితునికి మద్దతు సరికాదు..నన్నపనేని
కృష్ణాజిల్లా : చందర్లపాడు (మం) తోటరావులపాడు గ్రామంలో తండ్రిచేతిలో దారుణ హత్యకు గురైన చంద్రిక కుటుంబాన్ని మహిళా కమీషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. చంద్రిక ప్రేమించిన వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుండగా సహించలేని తండ్రి దారుణంగా హతమార్చాడు. అలాంటి వ్యక్తిని చంద్రిక తల్లి, చెల్లి చాలా మంచివాడని, విడిపించాలని అడగటం ఆశ్చర్యంగా ఉందని నన్నపనేని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడికి వారు వత్తాసు పలకడం నచ్చలేదని, చట్టంముందు ఎవరైనా ఒకటేనని అన్నారు. పోలీసులు సరైన సాక్ష్యాలు సేకరించి తొండపు కోటయ్యకు కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నానన్నారు. -
పరువుహత్య కేసులో నిందితుల లొంగుబాటు
తుంగతుర్తి :పరువుహత్య కేసులో నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. కులాంతర వివాహం చేసుకుని తమ పరువు మంటకలిపిందనే కోపంతోనే కూతురిని దారుణంగా అంతమొందించినట్లు ఒప్పుకున్నారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన స్వప్న తల్లిదండ్రులు బయ్య లింగమల్లు, బచ్చమ్మను సీఐ పార్థసారథి మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యకు గల కారణాలు, నింది తుల వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి మండలం మామిడిపెల్లి గ్రామానికి చెందిన లింగమల్లు, బచ్చమ్మలు పదిహేనేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం మండలంలోని గానుగుబండకు వలస వచ్చారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు స్వప్న అదే గ్రామానికి చెందిన జలగం ప్రవీణ్‌ను ప్రేమించుకున్న విషయం గత ఏడాది తల్లిదండ్రులకు తెలి సింది. వారి ప్రేమ ఇష్టం లేని తల్లిదండ్రులు తమ కూతురుకు వేరే వ్యక్తితో వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల 14వ తేదీన స్వప్న తన ప్రియుడు ప్రవీణ్‌తో వెళ్లి భద్రాచలంలో వివాహం చేసుకుంది. అనంతరం కొద్దిరోజులకు స్వప్న తన భర్తతో కలసి వచ్చి గ్రామంలో నివసిస్తుండడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఈ నెల 9వ తేదీన రాఖీ పండగకు తీసుకొచ్చి దారుణంగా హత్య చేశారని వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ గౌరినాయుడు ఉన్నారు.