
మహిళల్లో మనోధైర్యమే నా కర్తవ్యం
* ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి
* నేడు చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
తెనాలి : మహిళల్లో మనోధైర్యం నింపడ మే నా కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియ మితులైన నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా మహిళల సమస్యలపై పనిచేస్తానని ‘సాక్షి’కి ఇచ్చి న ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
మహిళలపై దురాచారాలకు పాల్పడేవారికి గుణపాఠం చెప్పేలా వ్యవహరిస్తా. ఇందుకోసం పరిశ్రమలు, వ్యవసాయం, గ్రామాలు, మురికివాడల్లోని మహిళల స్థితిగతులపై అధ్యయనం చేస్తా. పేదలపై వేధింపులే కాదు, పబ్‌లు, పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న సంపన్న కుటుంబాల్లోని వ్యక్తుల గురించి మా దృష్టికి వస్తే చర్యలు తప్పవు.
వరకట్నం, గృహహింస కేసుల్లో గుడ్డిగా కాకుండా ఆచితూచి పరిశీలన చేయాలని భావిస్తున్నా. అన్ని కోణాల్లోనూ విచారించి ప్రలోభాలకు లోబడి, డబ్బుకాశపడి లేదా కక్షసాధింపు కోసం అమాయకులపై ఫిర్యాదులు చేస్తే మద్దతు పలకను.
సమస్యలు-పరిష్కారాలపై మహిళలకు అవగాహన కల్పించేందుకు ముం దుగా రాష్ట్రవ్యాప్తంగా సదస్సుల నిర్వహించాలని ఆలోచిస్తున్నా. మార్చిలో విజయవాడలో భారీసదస్సు ఏర్పాటుచేసి, సీఎంను ఆహ్వానించాలనుకున్నా. తర్వాత జిల్లాలవారీగా సదస్సులు పెట్టి, మండలాలకు విస్తరించాలనుకుంటున్నా. వివిధ అంశాలపై మహిళలకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నా.