
వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యసభలో మహిళలపై చర్చ జరిగింది. ఈ చర్చలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. దేశంలో వరకట్న నిషేధ చట్టం సరిగ్గా అమలు కావడం లేదని తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంతేకాక చట్ట సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గర్భంలోనే ఆడ శిశువుల అబార్షన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ విజయసాయి రెడ్డి కోరారు.