
మహిళల హక్కులు పరిరక్షించాలి
అనంతపురం టౌన్ : మహిళల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గురువారం అనంతపురం శివారులో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటైన ఉజ్వల హోంను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అత్యాచారం, వేధింపులు, బాల్య వివాహాలు తదితర కారణాలతో ఆశ్రయం పొందుతున్న బాధితులతో మాట్లాడారు. స్వయం ఉపాధి శిక్షణపై ఆరా తీశారు.
బాధితులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. చట్టంలో ఉన్న కొన్ని లొసుగుల వల్ల మహిళలకు అన్యాయం జరిగిన సంఘటనల్లో నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి బెయిల్ మంజూరు చేయకుండా సామాజికంగా వారికి శిక్ష విధించాలన్నారు.