సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలో మతిస్థిమితం సరిగా లేని మహిళపై పట్టపగలు ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిందిపోయి సెల్‌ఫోన్లతో చిత్రీకరించినవారిపై చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. బుధవారం ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపడానికి విశాఖ వెళ్లి పోలీస్ కమిషనర్‌తో మాట్లాడతానని చెప్పారు. మహిళలను విలన్లుగా చిత్రీకరించి, అసభ్యంగా చూపిస్తున్న టీవీ సీరియళ్లపై నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె ప్రధానికి, పలువురు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. సమావేశంలో ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు ఎన్.పర్వీన్ బాను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment