'హోదా వస్తుందంటే నాతో పాటు 10 మంది రెడీ'
హైదరాబాద్: అనంతపురం లోక్సభ సభ్యుడు, టీడీపీ నేత జేసీ దివాకర్రెడ్డి మరో సారి సంచలన వ్యాఖ్యలకు తెర తీశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసినా ఏపీకి ప్రత్యేక హోదా రాదని జేసీ దివాకర్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జేసీ దివాకర్రెడ్డి ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందంటే నేను, మరో 10 మంది ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కి కోపం ఎక్కువ కాబట్టే లేటెస్ట్ నాయకుడయ్యారన్నారు. చంద్రబాబుకు కోపం తక్కువ కాబట్టే ఔట్ డేటెడ్ నాయకుడయ్యారన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కి బీహార్ కంటే ఎక్కువ ప్యాకేజీ వస్తుంది కానీ ప్రత్యేక హోదా మాత్రం రాదని జేసీ దివాకర్రెడ్డి తెలిపారు.