: ప్రత్యేక హోదా తెస్తానంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చెప్పి తామంతా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెంట వస్తామని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ఎంపీల తీరును ప్రశ్నించడంపై ఆయన ఆదివారం మీడిమా సమావేశంలో మాట్లాడారు. ఒక రకమైన మనోవేదనతో పవన్ మాట్లాడారని చెప్పారు.