కేశినేని నాని వెంటనే స్థలాన్ని ఖాళీ చేయాలి
విజయవాడ : విజయవాడ పాత బస్టాండ్ సెంటర్‌లోని స్థలానికి సంబంధించి వివాదం మరింత ముదిరింది. ఎంపీ కేశినేని కార్యాలయం వద్ద ప్రైవేట్ స్థలానికి సోమవారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో స్థల యజమాని బొమ్మదేవర వెంటక సుబ్బారావు 500 గజాల తన స్థలాన్ని కేశినేని నాని ఆక్రమించారంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
కేశినేని నాని ఆ స్థలాన్ని వాహనాలు పార్కింగ్ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. అయితే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని సుబ్బారావు ఎన్నిసార్లు కోరినా...ఎంపీ స్పందించకపోవటంతో పోలీసుల్ని ఆశ్రయించాడు. సాయంత్రంలోగా స్థలాన్ని ఖాళీ చేయాలని సుబ్బారావు డిమాండ్ చేశాడు. కాగా ఇదే విషయంపై స్థల యజమాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విజ్ఞప్తి చేశాడు.