
పాక్‌తో యుద్ధం వద్దు
ప్రధానికి దేవేందర్ గౌడ్ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో ఆర్థికాభివృద్ధి పురోగమనంలో ఉన్న దశలో యుద్ధం సంభవిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఉడీ ఘటన, భారత సైన్యం మెరుపుదాడుల అనంతరం పాకిస్తాన్ భారత్‌తో యుద్ధానికి ఉవ్విళ్లూరుతోందని, మనం యుద్ధానికి సిద్ధపడకుండా పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేయాలని ఆయన ప్రధానిని కోరారు.