టీడీపీపీ భేటీకి కేంద్ర మంత్రి అశోక్‌ డుమ్మా | TDP MP ashok ganapathiraju not attend to tdpp meeting | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 5 2018 7:04 AM | Last Updated on Mon, Aug 20 2018 5:08 PM

TDP MP ashok ganapathiraju not attend to tdpp meeting - Sakshi

సాక్షి, అమరావతి : అత్యంత కీలకమైన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) సమావేశానికి ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవంటూ సీఎం చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రి అశోక్‌ రాకపోవడం వెనుక బలమైన కారణాలేమైనా ఉన్నాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత కొద్దికాలంగా సీఎం చంద్రబాబుతో ఆయనకు పొసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అశోక్‌ పార్టీతో, చంద్రబాబుతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన టీడీపీపీ సమావేశానికి ఆయన గైర్హాజరవడం గమనార్హం. కాగా, చైనా పర్యటనకు వెళ్లిన అశోక్‌ శనివారం రాత్రే రావడంతో సమావేశానికి హాజరుకాలేకపోయారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement