నిమ్మల భూ కిరికిరికి రెవెన్యూ చెక్‌ | revenue check to nimmala land corrption | Sakshi
Sakshi News home page

నిమ్మల భూ కిరికిరికి రెవెన్యూ చెక్‌

Published Fri, Oct 21 2016 11:51 PM | Last Updated on Fri, Aug 10 2018 7:07 PM

నిమ్మల భూ కిరికిరికి రెవెన్యూ చెక్‌ - Sakshi

నిమ్మల భూ కిరికిరికి రెవెన్యూ చెక్‌

గోరంట్ల : హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప  తనయులు అక్ర మ మార్గంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి ప్రయత్నించిన భూమిని రెవెన్యూ అధికారులు తిరిగి బాధిత రైతు మల్లేశప్ప పేరిట అడంగల్‌లో నమోదు చేయించారు. ‘ నిమ్మల భూ కిరికిరి’  శీర్షికన  15 వతేదీ సాక్షిలో వార్తాకథనం ప్రచురితమైన విషయం విదితమే. అలాగే బాధిత రైతు మల్లేశప్ప  జిల్లా కలెక్టర్, ఎస్పీని మీ కోసం కార్యక్రమంలో కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకున్నాడు. 

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 18న స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో 2011లో భూమి కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు బాధిత రైతు మల్లేశప్ప  తహశీల్దార్‌ ఎదుట హాజరై తమ వాంగ్మూలంతో పాటు భూములకు సంబంధించిన పక్కా రికార్డులను సమర్పించారు. ఈ మేరకు ఆమె పంపిన నివేదిక ఆధారంగా మల్లేశప్ప  పేరిట అడంగల్‌ ను  య«థాస్థానంలో ఉంచాలని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ ఆదేశించారని స్థానిక తహశీల్దార్‌  హసీనాసుల్తానా సాక్షికి  ఫోన్‌ ద్వారా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement