తోట నరసింహం పీఏపై లైంగిక వేధింపుల కేసు | harassment case filed against TDP MP Thota Narasimham PA sarma | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 20 2016 4:34 PM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టీడీపీ ఎంపీ తోట నరసింహం పీఎ శర్మ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. రాయుడు పాలెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న తనపై శర్మ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఓ మహిళ కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో సర్పవరం పోలీసులు శర్మపై కేసు రిజిస్టర్‌ చేశారు. ఐపీసీ సెక్షన్లు 354, 509, 506 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement