
అనంతలో మళ్లీ బయటపడ్డ టీడీపీ వర్గపోరు
అనంతపురం : అనంతపురం జిల్లా టీడీపీలో వర్గపోరు మరో బయటపడింది. అనంతపురంలో రోడ్ల విస్తరణ చేస్తామని స్థానిక ఎంపీ జేసీ దివాకర్రెడ్డి స్పషం చేశారు. అయితే అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే వి. ప్రభాకర్చౌదరి.... జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యలో విభేదించారు. ప్రస్తుతం అనంతపురంలో రోడ్ల విస్తరణ అవసరం లేదని ప్రభాకర్ చౌదరి చెప్పారు. ఆ క్రమంలో ఇరువురి నాయకుల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.