జేసీ అక్రమాల చిట్టా నా దగ్గర ఉంది : టీడీపీ ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 20 2019 7:30 PM

TDP MLA Prabhakar Chowdary Fires On JC Diwakar Reddy - Sakshi

సాక్షి, అనంతపురం : ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుల వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి ఫైర్‌ అయ్యారు. తనపై అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదని స్పష్టం చేశారు. జేసీ దివాకర్‌ రెడ్డి అక్రమాల చిట్టా తన వద్ద ఉందని హెచ్చరించారు. అనంతపురం లలితా కళా పరిషత్‌లో ఆదివారం జరిగిన బీసీ సదస్సులో ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ.. రాంనగర్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ప్రారంభానికి జేసీ సిద్ధమవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంట్రాక్టర్‌గా పనులు చేసినంత మాత్రానా అన్నిహక్కులు వస్తాయా? అని ప్రశ్నించారు.

పీస్‌ మెమొరియల్‌ హాల్‌కు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పేరు పెడితే జేసీ దివాకర్‌ రెడ్డికి ఎందుకంత కడుపు మంట? అని మండిపడ్డారు. తన ఓపికను పరీక్షించొద్దని జేసీపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఇక అనంతపురంలో ప్రారంభానికి సిద్దంగా ఉన్న రాంనగర్‌ బ్రిడ్జి విషయంలోనే ఈ ఇద్దరి నేతల మధ్య వివాదం నెలకొంది. ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు జేసీ సిద్దమవుతున్నారని ప్రభాకర్‌ చౌదరి అనుమానిస్తున్నారు. ఈనేపథ్యంలోనే జేసీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఈ ఇద్దరి నేతల మధ్య మాటల వార్‌ నడిచింది.

Advertisement
 
Advertisement
 
Advertisement