
సాక్షి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే మంగళవారం నలుగురు జేసీ వర్గీయుల సస్పెన్షన్‌కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సిఫార్సు చేశారు. దీంతో ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా జేసీ వర్గీయులు సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వొద్దంటూ జేసీ వర్గీయులు తీర్మానం చేశారు.
చదవండి: (బసవతారకం ఆస్పత్రిలో కూడా ఆ మాటలు వినిపిస్తున్నాయి: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment