
సాక్షి, అనంతపురం : వర్గ విభేదాలతో అనంతపురంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రభాకర్‌పై జేసీ బుధవారం సంచలన వాఖ్యలు చేశారు. అనంతపురంలో రోడ్ల వెడల్పుకు ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రభాకర్ చౌదరి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
మున్సిపల్ భవనాల అద్దె డబ్బు మేయర్‌తో కలిసి స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఆర్కియాలజీకి అప్పగించిన పీస్ మెమోరియల్ హాల్‌పై ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పెత్తనం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో దౌర్జన్యాలు, రౌడీయిజం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పోరేషన్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment