
'పవన్ కళ్యాణ్ నోరు మూయించడానికే'
ఢిల్లీ: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద గురువారం టీడీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ధర్నాలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు చేసే ధర్నాలన్నీ ప్రజలను మభ్యపెట్టే కంటితుడుపు చర్యలన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ల నోర్లు మూపించడానికి ఇటువంటి ధర్నాలు పనికి వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా మంత్రాలకు చింతకాయలు రాలవంటూ ఎద్దేవా చేశారు.