ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు...
బీజేపీతో చెలిమిపై ఎంపీ జయదేవ్
మంగళగిరి : తాము వచ్చే సాధారణ ఎన్నికల వరకు బీజేపీతో కలిసే నడుస్తామని, ఆ తర్వాత ఏం జరుగుతుందో తనకు తెలియదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మండలంలోని ఆత్మకూరు గ్రామంలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ గృహాలకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం విడతల వారీగా నిధులు అందజేస్తూ సహకరిస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తుందని కేంద్రంపై నమ్మకం వుందన్నారు.
టీడీపీ ఎంపీలు రాష్ట్రాభివృద్ధి కోసం పని చేయలేదని పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. పవన్ కళ్యాణ్‌ను కలిసి తాము ఏ విధంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామో తెలియజేసి అనంతరం ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తానన్నారు. కార్యక్రమంలో మంగళగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ గంజి చిరంజీవి, పార్టీ నాయకులు చావలి ఉల్లయ్య, నందం అబద్ధయ్య, సంకా బాలాజీగుప్తా పాల్గొన్నారు.